ePaper
More
    HomeజాతీయంRahul Gnadhi | ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబు లాంటి వార్త చెబుతా.. మోదీ ఇక...

    Rahul Gnadhi | ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబు లాంటి వార్త చెబుతా.. మోదీ ఇక ముఖం చూపించరేమోమన్న రాహుల్ గాంధీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gnadhi | ఎన్నికల సంఘంపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈసారి ఆరోపణలను తీవ్రతను మరింత పెంచారు. ఓట్ల చోరీపై త్వరలో హైడ్రోజన్ బాంబు(Hydrogen Bomb) లాంటి వాస్తవాలు వెల్లడిస్తానని చెప్పారు. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి తన ముఖం చూపించలేరన్నారు.

    బీహర్ లో ఆయన చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర(Voter Adhikar Yatra) ముగింపు సందర్భంగా సోమవారం పాట్నాలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. “బీజేపీ నా మాట వినాలి. మీరు అణు బాంబు గురించి విన్నారా? నేను దానిని విలేకరుల సమావేశంలో చూపించాను. ఇప్పుడు, అంతకంటే పెద్దది ఉంది హైడ్రోజన్ బాంబు. మీరందరూ దానికి సిద్ధంగా ఉండాలి. ఓటు చోరీ గురించి నిజాలు దేశ ప్రజల ముందుకు రానున్నాయి. ఆ హైడ్రోజన్ బాంబు తర్వాత, ప్రధాని మోదీ(Prime Minister Modi) దేశానికి తన ముఖం చూపించలేరు” అని అన్నారు.

    Rahul Gnadhi | రాజ్యాంగాన్ని హత్య చేసే యత్నం..

    రాహుల్(Rahul Gnadhi) మరోసారి ఆర్ ఎస్ ఎస్పై ఆరోపణలు గుప్పించారు. మహాత్మా గాంధీని హత్య చేసిన అదే శక్తులు ఇప్పుడు రాజ్యాంగాన్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. “ఏం జరిగినా రాజ్యాంగాన్ని హత్య చేయడానికి మేము వారిని అనుమతించము. బీహార్ ఒక విప్లవాత్మక రాష్ట్రం. ఇది మొత్తం దేశానికి సందేశం పంపింది- ‘ఓటు దొంగతనం’ జరగనివ్వము” అని పేర్కొన్నారు.

    Rahul Gnadhi | చైనా పర్యటనపైనా విమర్శలు..

    ప్రధాని మోదీ చైనా పర్యటనపై రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు, “ఓటు చోర్, గడ్డి చోడ్” అనే నినాదం భారతదేశానికే పరిమితం కాదని, బీజింగ్కు కూడా చేరుకుందన్నారు. “ఓటు చోర్ గడ్డి చోడ్, బీహార్(Bihar) మే నయా నారా చాలా హై (బీహార్లో కొత్త నినాదం ఉంది), ‘ఓటు చోర్, గడ్డి చోడ్’…చైనా, అమెరికాలో కూడా ప్రజలు ‘ఓటు చోర్, గడ్డి చోడ్’ అంటున్నారు” అని రాహుల్ గాంధీ తెలిపారు.

    More like this

    Bodhan | వినాయక నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి

    అక్షరటుడే, బోధన్: Bodhan | పట్టణంలో వినాయక నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు చేయాలని అడిషనల్​ కలెక్టర్​ అంకిత్​ (Additional...

    Ganesh Laddu | రూ.51 లక్షలు పలికిన గణపతి లడ్డూ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ganesh Laddu | వినాయక చవితి ఉత్సవాలు (Vinayaka Chavithi celebrations) ఘనంగా సాగుతున్నాయి. పలు...

    IPL Tickets | జీఎస్టీలో భారీ సంస్కరణలు.. ఐపీఎల్ టికెట్లపై పన్ను పెంపు.. మ్యాచ్‌ల ఎట్ల చూడాలి!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL Tickets | కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో (GST system) సంచలనాత్మక మార్పులు...