ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిHeavy rains | భారీవర్షాలు కురిసే అవకాశాలున్నందున అప్రమత్తంగా ఉండాలి: సబ్​ కలెక్టర్​

    Heavy rains | భారీవర్షాలు కురిసే అవకాశాలున్నందున అప్రమత్తంగా ఉండాలి: సబ్​ కలెక్టర్​

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Heavy rains | జిల్లాలో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరించిందని బాన్సువాడ సబ్​కలెక్టర్ (Banswada Sub-Collector Kiranmai) కిరణ్మయి​ పేర్కొన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.

    డివిజన్​లోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని పేర్కొన్నారు. డివిజన్​లో అధిక వర్షాల వల్ల కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మళ్లీ భారీ వర్షాలు కురిస్తే గ్రామస్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు అధికారులు క్షేత్రస్థాయిలో చురుగ్గా వ్యవహరించాలన్నారు.

    ముంపునకు గురయ్యే ప్రాంతాలు, అధికంగా ఓవర్​ఫ్లో అయ్యే ప్రాజెక్టులు, చెరువులు, ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, వంకలు వైపు ప్రజలు వెళ్లకుండా చూడాలని సబ్​ కలెక్టర్​ పేర్కొన్నారు. పాత ఇళ్లు, భవనాలు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు తదితర అన్ని ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆమె స్పష్టం చేశారు.

    గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఎప్పటికప్పుడు పరిస్థితులను డివిజన్, జిల్లాస్థాయిలో అధికారులకు తెలియజేయాలన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. చేపల వేటకు వెళ్లేవారు, పశువులు, గొర్రెల కాపరులు నీటి పరీవాహక ప్రాంతాల్లో అధికారుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

    More like this

    GST | ‘కారు’ చౌక!..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: GST | జీఎస్టీ లో తీసుకువచ్చిన సంస్కరణలతో చిన్న కార్ల ధరలు తగ్గనున్నాయి. నాలుగు మీటర్ల...

    Ganesh Immersion | గణేష్ శోభాయాత్రలో 1300 మంది సిబ్బందితో పటిష్ట భద్రత

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Ganesh Immersion | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్​ (Nizamabad Police Commissionerate) పరిధిలో గణేష్​...

    Bodhan | వినాయక నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి

    అక్షరటుడే, బోధన్: Bodhan | పట్టణంలో వినాయక నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు చేయాలని అడిషనల్​ కలెక్టర్​ అంకిత్​ (Additional...