ePaper
More
    HomeజాతీయంVice President Elections | అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా : ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్​రెడ్డి

    Vice President Elections | అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా : ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Elections | రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే తాను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్​ సుదర్శన్​రెడ్డి (Justice Sudarshan Reddy) అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్​లో మాట్లాడారు.

    జగదీప్​ ధన్​ఖడ్​ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి (Vice President) పదవికి ఈ నెల 9న ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎన్డీఏ కూటమి నుంచి సీపీ రాధాకృష్ణన్​ పోటీ చేస్తున్నారు. సంఖ్యా బలం లేకున్నా ఇండియా కూటమి తన అభ్యర్థిగా తెలంగాణకు (Telangana) చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ సుదర్శన్​రెడ్డిని నిలిపిన విషయం తెలిసిందే. సోమవారం ఆయన హైదరాబాద్​లో సీఎం రేవంత్​రెడ్డితో (CM Revanth Reddy) భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు.

    Vice President Elections | ప్రతిపక్షాల అభ్యర్థిని..

    తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాదని.. ప్రతిపక్షాల అభ్యర్థినని సుదర్శన్​రెడ్డి పేర్కొన్నారు. కూటమిలో లేకున్నా.. కేజ్రీవాల్‌ (Kejriwal) తనకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. రాజకీయం అనే ముళ్ల కిరీటాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారని చాలా మంది తనను అడిగారన్నారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించలేదని ఆయన చెప్పారు. నాకు ఏ పార్టీలో సభ్యత్వం లేదని, ఇక ముందు కూడా ఉండదని స్పష్టం చేశారు. పౌరహక్కులు, సామాజిక న్యాయం కోసం మాట్లాడతానని పేర్కొన్నారు.

    Vice President Elections | ప్రమాదంలో రాజ్యాంగం

    తన ప్రయాణం 53 ఏళ్లుగా రాజ్యాంగంతో సాగుతోందని సుదర్శన్​రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, దాన్ని కాపాడటమే తన ధ్యేయమన్నారు. అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తాను ఎన్ని సవాళ్లు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. రాజ్యాంగం కోసం పౌరులందరు మాట్లాడాల్సిన సమయం వచ్చిందన్నారు.

    Vice President Elections | సుదర్శన్​రెడ్డికి మద్దతు ఇవ్వాలి

    ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్​రెడ్డికి తెలుగు రాష్ట్రాల పార్టీలు మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్​రెడ్డి కోరారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఆయనను పోటీకి ఎంపిక చేసినట్లు చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టేలా ఆయన పని చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​, మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    More like this

    IPL Tickets | జీఎస్టీలో భారీ సంస్కరణలు.. ఐపీఎల్ టికెట్లపై పన్ను పెంపు.. మ్యాచ్‌ల ఎట్ల చూడాలి!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL Tickets | కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో (GST system) సంచలనాత్మక మార్పులు...

    Teacher Suspension | పూటుగా తాగొచ్చి క్లాస్​ రూంలో పడుకున్న టీచర్​.. తర్వాత ఏం జరిగిందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Teacher Suspension | కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల (Teachers) తీరుతో అందరికీ చెడ్డ పేరు...

    CM Revanth Reddy | శాశ్వత ప్రాతిపదికను వంతెన నిర్మాణాలు చేపట్టాలి: సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: CM Revanth Reddy | వరదల కారణంగా జిల్లాలో దెబ్బతిన్న వంతెనలపై శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు...