ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిCPS | పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి

    CPS | పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: CPS | సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టీఎన్జీవోస్ (TNGO’s Kamareddy) జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్​లో సోమవారం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కామారెడ్డి (Employees’ JAC Kamareddy) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగుల పాత పెన్షన్ సాధన కోసం నల్లచొక్కాలు, బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.

    ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ ఒకటవ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా (Pension Rebellion Day) పాటించాలని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరసన తెలిపామన్నారు. సీపీఎస్ అనేది ఉద్యోగుల పాలిట పెను శాపంగా మారిందన్నారు. పెన్షన్ లేక ఉద్యోగులు ఆర్థిక భద్రత లేక వృద్ధాప్యంలో ఇంకొకరి మీద ఆధారపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కోరారు.

    అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగుల ఐదు డీఏలు పెండింగ్​లో ఉన్నాయని, పెండింగ్ డీఏలతో పాటు ఉద్యోగుల పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగులకు అత్యంత అవసరమైన ఉద్యోగుల ఆరోగ్య కార్డులు లేక ఆర్థికంగా ఉద్యోగులు నష్టపోతున్నారని, హెల్త్​కార్డులు (Health Cards) మంజూరు చేసి ఉద్యోగులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. అనంతరం ఉద్యోగులు హైదరాబాద్​కు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో జేఏసీ ఛైర్మన్ దేవేందర్, కో ఛైర్మన్​ ఆకుల బాబు, చింతల లింగం, డిప్యూటీ సెక్రెటరీ నాగరాజు, సాయిరెడ్డి ఉద్యోగులు పాల్గొన్నారు.

    More like this

    Hyderabad | యాప్​ ద్వారా డ్రగ్స్​ విక్రయాలు.. ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో డ్రగ్స్​ దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వం కఠిన చర్యలు...

    Mallikarjuna Kharge | ఒక దేశం.. తొమ్మిది ప‌న్నులు.. జీఎస్టీపై మ‌ల్లికార్జున ఖ‌ర్గే వ్యాఖ్య‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallikarjuna Kharge | వ‌స్తు సేవ‌ల ప‌న్ను(జీస్టీ) హేతుబద్ధీకరణ, రేటు తగ్గింపులపై కాంగ్రెస్ విభిన్నంగా...

    Madras IIT | దేశంలో టాప్ విద్యాసంస్థ‌ల జాబితా విడుద‌ల‌.. అగ్ర‌స్థానంలో మ‌ద్రాస్ ఐఐటీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Madras IIT | దేశంలో అత్యుత్త‌మ విద్యాసంస్థ‌ల జాబితాను కేంద్ర ప్ర‌భుత్వం గురువారం విడుద‌ల...