ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Vinayaka Chavithi | గణేశ్​ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి

    Vinayaka Chavithi | గణేశ్​ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి

    Published on

    అక్షరటుడే, బోధన్: Vinayaka Chavithi | పట్టణంలో గణేశ్​​ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని బోధన్​ స​బ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato) అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం డివిజన్​ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమజ్జనం సందర్భంగా రోడ్లపై ఉన్న గుంతలను తక్షణమే పూడ్చివేయించాలని సూచించారు. అలాగే నిమజ్జన యాత్ర రూట్​లో అడ్డుగా ఉన్న చెట్లకొమ్మలను తొలగించాలని.. కరెంట్​ తీగలను సరిచేయాలని విద్యుత్​శాఖ అధికారులకు సూచించారు.

    వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే చెరువు వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని కోరారు. వారు ఎల్లవేళలా అలర్ట్​గా ఉండేలా స్థానిక అధికారులను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. నిమజ్జనం జరిగే రూట్​లో పటిష్టమైన పోలీస్​ బందోబస్తు (Police security) ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమీక్షలో బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​ (Bodhan ACP Srinivas), తహశీల్దార్​ విఠల్​, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Basketball Selections | రేపు బాస్కెట్​బాల్ సబ్ జూనియర్​​ క్రీడాకారుల ఎంపికలు

    అక్షరటుడే, ఇందూరు : Basketball Selections | జిల్లా బాస్కెట్​బాల్​ అసోసియేషన్(District Basketball Association) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సబ్...

    Moneylenders | బడా వడ్డీ వ్యాపారులపై చర్యలేవి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Moneylenders | వడ్డీ వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నిజామాబాద్​ కమిషనరేట్​ పోలీసులు (Nizamabad...

    Nandipet | వెల్మల్​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడు, నందిపేట్ ​: Nandipet | వెల్మల్(Velmal)​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ను మంగళవారం అందజేశారు. నందిపేట మండలం కేదారీశ్వర...