ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Ration cards | నూతన రేషన్​కార్డుల పంపిణీ

    Ration cards | నూతన రేషన్​కార్డుల పంపిణీ

    Published on

    అక్షరటుడే, కోటగిరి: Ration cards | ఎన్నో ఎళ్లుగా కొత్త రేషన్​కార్డుల (Ration Cards) కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల కల సాకరమైందని పోతంగల్ (Pothangal)​ కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు పుప్పాల శంకర్​ అన్నారు. పోతంగల్ మండలంలోని హంగర్గ ఫారం (Hungarga Farm) గ్రామంలో 112 మంది లబ్ధిదారులకు సోమవారం కొత్త రేషన్​కార్డులను పంపిణీ చేశారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తోందన్నారు. చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం కాబట్టే హామీల అమలులో నిర్లక్ష్యం చేయట్లేదని స్పష్టం చేశారు. బీఆర్​ఎస్​ పాలించిన పదేళ్లలో ఒక్క రేషన్​కార్డు కూడా ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.

    రేషన్​కార్డులు అందుకున్న లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు షేక్ సజ్జాత్, కాంగ్రెస్ నాయకులు దిలీప్ కుమార్, గ్రామ పెద్దలు షేక్ వలీవుద్దీన్​, బాపురావు, సూరారెడ్డి, డీలర్ శంషొద్దీన్​ శంషుద్దీన్, కిషన్, యూత్ నాయకులు ఫెరోజ్, నిసార్, పాషా, మజీద్ కమిటీ అధ్యక్షులు షేక్ మౌలానా, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Supreme Court | ఠాణాల్లో ప‌ని చేయ‌ని సీసీ కెమెరాలు.. సుమోటోగా స్వీక‌రించిన సుప్రీంకోర్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | దేశంలోని అనేక పోలీసుస్టేష‌న్ల‌లో సీసీ కెమెరాలు ప‌ని చేయ‌క పోవ‌డంపై...

    Banswada | ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు...

    MLC Kavitha | ఆడ‌త‌న‌మే శాప‌మా? రాజ‌కీయ వార‌స‌త్వంలోనూ కొడుకుల‌కే పెద్ద‌పీట‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MLC Kavitha | తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ క‌విత ఎపిసోడ్ తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పార్టీ...