ePaper
More
    HomeజాతీయంBank Holidays | సెప్టెంబ‌ర్‌లో బ్యాంకుల‌కు అన్ని రోజులు సెల‌వులా.. ఒక‌సారి లిస్ట్ చెక్ చేసుకోండి..!

    Bank Holidays | సెప్టెంబ‌ర్‌లో బ్యాంకుల‌కు అన్ని రోజులు సెల‌వులా.. ఒక‌సారి లిస్ట్ చెక్ చేసుకోండి..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bank Holidays | ఆగస్టు నెలలో చివ‌రి రోజు సెల‌వుతో ముగిసింది. ఇక కొత్త నెల సెప్టెంబర్​లోకి ఎంట‌ర‌య్యాం. నెల మారిన‌ప్పుడ‌ల్లా సామాన్యుడి దృష్టి బ్యాంకులు, గ్యాస్ బుకింగ్స్, క్రెడిట్-డెబిట్ కార్డుల బిల్లు తేదీలు, కొత్త చట్టాలు, ఆర్థిక మార్పుల వంటి విష‌యాల‌పై ఉంటుంది.

    ఈ నేప‌థ్యంలో సెప్టెంబర్ నెలలో (September Month) బ్యాంకులకు సెలవులు ఎప్పుడు వస్తాయో ముందే తెలుసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా, బ్యాంకులకు సంబంధించిన పనులు, లావాదేవీలు ప్లాన్ చేసుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. RBI జారీ చేసిన సెప్టెంబర్ 2025 బ్యాంకు సెలవుల జాబితా ప్రకారం సెప్టెంబర్‌లో 15 రోజులు బ్యాంకులు మూత ప‌డ‌నున్నాయి.

    కొన్ని సెలవులు ప్రాంతీయమైనవి మాత్రమే కాగా.. ఆదివారాలు, రెండో, నాల్గో శనివారాలు మాత్రం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు.

    సెప్టెంబర్ 2025 బ్యాంకు సెలవుల లిస్ట్ చూస్తే..

    సెప్టెంబర్ 3 కర్మ పూజ రాంచీ
    సెప్టెంబర్ 4 తొలి ఓనం కొచ్చి, తిరువనంతపురం
    సెప్టెంబర్ 5 ఈద్-ఎ-మిలాద్ / తిరువోణం ముంబయి, అహ్మదాబాద్, ఇతర ప్రాంతాలు
    సెప్టెంబర్ 6 ఈద్-ఎ-మిలాద్ / ఇంద్రజాత్ర గ్యాంగ్‌టక్, జమ్మూ, రాయ్‌పూర్, శ్రీనగర్
    సెప్టెంబర్ 7 ఆదివారం దేశవ్యాప్తంగా
    సెప్టెంబర్ 12 ఈద్-ఎ-మిలాద్ జమ్మూ, శ్రీనగర్
    సెప్టెంబర్ 13 రెండవ శనివారం దేశవ్యాప్తంగా
    సెప్టెంబర్ 14 ఆదివారం దేశవ్యాప్తంగా
    సెప్టెంబర్ 21 ఆదివారం దేశవ్యాప్తంగా
    సెప్టెంబర్ 20 నాల్గవ శనివారం దేశవ్యాప్తంగా
    సెప్టెంబర్ 22 నవరాత్రి జైపూర్
    సెప్టెంబర్ 23 మహారాజా హరి సింగ్ జయంతి జమ్మూ, శ్రీనగర్
    సెప్టెంబర్ 28 ఆదివారం దేశవ్యాప్తంగా
    సెప్టెంబర్ 29 మహా సప్తమి కోల్‌కతా, అగర్తలా, గ్యాంగ్‌టక్
    సెప్టెంబర్ 30 మహా అష్టమి పాట్నా, రాంచీ, గౌహతి, కోల్‌కతా, భువనేశ్వర్, జైపూర్, ఇంఫాల్

    సెలవుల్లో ఆన్‌లైన్ బ్యాంకింగ్ (Online Banking) అందుబాటులో ఉంటాయి. బ్రాంచ్‌లు మూతపడినా, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి. కాబట్టి బ్యాంకు సెలవుల్లో (Bank Holidays) కూడా మీరు ఫండ్ ట్రాన్స్​ఫర్​ చేయవచ్చు, బిల్లులు చెల్లించవచ్చు, ఖాతా బాలెన్స్ చెక్ చేయవచ్చు, FD/RDలు నిర్వహించవచ్చు. అయితే బ్యాంకులో చేయాల్సిన పనులు ఏవైనా ఉంటే, సెలవుల జాబితా చూసుకుని ముందే చేసేసుకోండి. ఇలా చేస్తే ట్రాన్సాక్షన్లలో అంతరాయం ఉండదు.

    More like this

    Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : యూఎస్‌(US), యూరోప్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. గురువారం ఉదయం...

    September 4 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 4 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 4,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Arikela Narsareddy | అరికెల నర్సారెడ్డికి ఘనంగా సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Arikela Narsareddy : నిజామాబాద్ పట్టణ మొటాడి రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు బుధవారం...