ePaper
More
    HomeతెలంగాణWeather Updates | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    Weather Updates | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు జిల్లాలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department Officers) తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో ఇటీవల కుండపోత వానలు బీభత్సం సృష్టించాయి. ఆకస్మిక వరదల నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. మరోవైపు మళ్లీ వర్షాలు ప్రారంభం కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం ఉదయం నుంచే పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి. రాత్రి పలు ప్రాంతాలో భారీ వర్షం(Heavy Rain) పడింది. మరోవైపు సోమవారం కూడా భారీ వర్షాలు పడుతాయని అధికారులు హెచ్చరించారు.

    Weather Updates | దంచికొడుతున్న వాన

    రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్​, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షం పడింది.ఆదిలాబాద్​, నిర్మల్​, ఆసిఫాబాద్​, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్​, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో నేడు కుండపోత వానలు పడే ఛాన్స్​ ఉంది. ఉమ్మడి నిజామాబాద్​, ఉమ్మడి మెదక్​, సిరిసిల్ల, జనగామ, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి.

    Weather Updates | హైదరాబాద్​ నగరంలో..

    హైదరాబాద్​లో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు నగరంలో వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్ర, రాత్రి పూట వర్షాలు పడుతాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయి.

    Weather Updates | వరదలతో జాగ్రత్త

    రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, జలాశయాలు నిండుకుండల్లా మారాయి. మళ్లీ భారీ వర్షాలు పడితే వరద ముంచెత్తే అవకాశం ఉంది. ఇటీవల కురిసిన కుండపోత వానలతో మెదక్​, కామారెడ్డి జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఆయా జిల్లాల్లో ఇప్పటికి పలు గ్రామాలకు రాకపోకలు సాగడం లేదు. మళ్లీ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పశువుల కాపర్లు, రైతులు వాగులు, నదుల సమీపంలోకి వెళ్లొద్దు.

    More like this

    Teenmar Mallanna comments | ఎమ్మెల్సీ కవితపై తీన్మార్​ మల్లన్న ఘాటైన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!

    Teenmar Mallanna comments | భారాస నుంచి తిరస్కరణకు గురైన ఎమ్మెల్సీ కవితపై తీన్మార్​ మల్లన్న సంచలన వ్యాఖ్యలు...

    Pawan birthday celebrations | ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

    అక్షరటుడే, ఇందూరు: Pawan birthday celebrations : పవర్​ స్టార్ Power Star​, ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh ఉప...

    MLC Kavitha future | పొమ్మన్న పుట్టినిల్లు.. వద్దన్న మెట్టినిల్లు.. ఢోలాయమానంలో ఎమ్మెల్సీ కవిత భవిత!

    అక్షరటుడే, హైదరాబాద్: MLC Kavitha future : ఇందూరు కోడలు, ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది....