అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gama Awards 2025 | దుబాయ్ షార్జా ఎక్స్‌పో సెంటర్ వేదికగా ఆగస్ట్ 30న ఘనంగా జరిగిన గామా 5వ ఎడిషన్‌లో సినీ ప్రముఖులు తెగ సందడి చేశారు. వైభవ్ జ్యువెలర్స్ (Vaibhav Jewellers) సమర్పణలో, ప్రాపర్టీస్ సహకారంతో ఈ వేడుక జరిగింది.
ఇప్పటికే నాలుగు సక్సెస్‌ఫుల్ ఎడిషన్లు పూర్తి చేసుకున్న గామా, ఈసారి మరింత వైభవంగా వేడుకని జరిపించారు. ఈ వేడుకకు టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు, బిజినెస్ లీడర్లు భారీగా హాజరయ్యారు. ఛైర్మన్ కేసరి త్రిమూర్తులు (Chairman Kesari Trimurthulu), సీఈవో సౌరభ్ కేసరి (CEO Saurabh Kesari) ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. యాంకర్ సుమ, కమెడియన్ హర్ష వ్యాఖ్యాతలుగా అలరించగా, ఫరియా అబ్దుల్లా, ఊర్వశీ రౌటెల, మానస వారణాశిలు ప్రత్యేక ప్రదర్శనలతో సందడి చేశారు.
గామా అవార్డ్స్ 2025 – విజేతల పూర్తి జాబితా:
బెస్ట్ యాక్టర్ – అల్లు అర్జున్ (పుష్ప 2: ది రూల్)
బెస్ట్ హీరోయిన్ – మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
బెస్ట్ మూవీ – పుష్ప 2
బెస్ట్ డైరెక్టర్ – సుకుమార్ (పుష్ప 2)
బెస్ట్ ప్రొడ్యూసర్ – అశ్వినీ దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ (కల్కి 2898AD)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవిశ్రీప్రసాద్ (పుష్ప 2)
బెస్ట్ కొరియోగ్రఫీ – భాను మాస్టర్ (నల్లంచు తెల్లచీర – మిస్టర్ బచ్చన్)
బెస్ట్ ఎడిటర్ – నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ – రత్నవేలు (దేవర)
బెస్ట్ లిరిసిస్ట్ – రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే – దేవర)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మెల్) – అనురాగ్ కులకర్ణి (సుట్టమలా సూసి – గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్) – మంగ్లీ (కళ్యాణి వచ్చావచ్చా – ఫ్యామిలీ స్టార్)
బెస్ట్ ఫిమేల్ సింగర్ (క్రిటిక్) – సమీరా భరద్వాజ్ (నల్లంచు తెల్లచీర – మిస్టర్ బచ్చన్)
బెస్ట్ ఫిల్మ్ (క్రిటిక్) – రజాకార్
బెస్ట్ యాక్టర్ (క్రిటిక్) – తేజ సజ్జా
బెస్ట్ పెర్ఫార్మెన్స్ యాక్టర్ (జ్యూరీ) – రాజా రవీంద్ర (సారంగదరియా)
బెస్ట్ యాక్టర్ (జ్యూరీ) – కిరణ్ అబ్బవరం (క)
బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ – రోషన్ (కోర్ట్)
బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్ట్రెస్ – శ్రీదేవి, మానస వారణాశి
బెస్ట్ ఆస్పైరింగ్ డైరెక్టర్ – అప్సర్ (శివం భజే)
గద్దర్ మెమోరియల్ మ్యూజిక్ అవార్డ్ – మట్ల తిరుపతి
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – వినయ్ రాయ్ (హనుమాన్)
బెస్ట్ కామెడీ రోల్ – బాలిరెడ్డి పృథ్వీరాజ్
బెస్ట్ సపోర్టింగ్ పెర్ఫార్మెన్స్ – హర్ష చెముడు (సుందరం మాస్టర్)
బెస్ట్ డెబ్యూ యాక్టర్ (ఫిమేల్) – నయన్ సారిక (ఆయ్, క)
బెస్ట్ డెబ్యూ యాక్టర్ (జ్యూరీ) – ధర్మ కాకాని (డ్రింకర్ సాయి)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ – యదు వంశీ (కమిటీ కుర్రాళ్ళు)
బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ – నిహారిక కొణిదెల (కమిటీ కుర్రాళ్ళు)
ప్రత్యేక అవార్డులు:
గ్లోబల్ కమెడియన్ అవార్డ్ – బ్రహ్మానందం
లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డ్ – అశ్వినీ దత్
ఫ్యాన్స్ ఫేవరెట్ స్టార్ – ఊర్వశీ రౌటెల
ప్రామిసింగ్ యాక్టర్ – సత్యదేవ్ (జీబ్రా)
గామా సీఈవో సౌరభ్ మాట్లాడుతూ.. తెలుగు, తమిళ, మళయాళ సినీ అభిమానుల మద్దతుతో దుబాయ్ వేదికగా ఈ వేడుకను అంతర్జాతీయ స్థాయిలో (International Level) నిర్వహించడం గర్వకారణం. గామా ప్రారంభం నుండి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని సౌరభ్ తెలిపారు. ఈవెంట్ మొత్తాన్ని ఒక స్టార్ స్టడెడ్ షోలా నిర్వహించిన గామా అవార్డ్స్ 2025 (Gama Awards 2025), గల్ఫ్ ప్రాంతంలో తెలుగు సినిమా పట్ల ఉన్న అభిమానాన్ని మరొకసారి రుజువు చేశాయి. టాలెంట్, గ్లామర్, గౌరవం ఇవన్నీ ఒకేచోట మిళితమైన వేడుకగా గామా నిలిచింది.