ePaper
More
    Homeఅంతర్జాతీయంearthquake in Afghanistan | ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. భారత్​పైనా ప్రభావం

    earthquake in Afghanistan | ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. భారత్​పైనా ప్రభావం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: earthquake in Afghanistan : దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌ Afghanistan లో సోమవారం (సెప్టెంబరు 1) తెల్లవారుజామున భారీ భూకంపం చోటుచేసుకుంది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.0గా నమోదైంది.

    ఈ భారీ భూకంపం వల్ల తొమ్మిది మంది చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనం. పదిహేను మంది తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు.

    ఈ భూకంప ధాటికి భారత్​తోపాటు పాకిస్తాన్​ Afghanistan లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

    దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్​లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా భవనాలు కంపించటంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకి వచ్చి వీధుల్లో పరుగులు తీశారు.

    earthquake in Afghanistan : ఇక్కడే భూకంపాలు..

    భారత్​, యురేషియా టెక్టోనిక్​ ప్లేట్లు Eurasian tectonic plate ఒకదానిపై ఒకటి పేరుకుపోవడంతో హిమాలయాలు Himalayas ఏర్పడ్డాయి.

    ఈ ప్రాంతంలో తరచూ ఈ ప్లేట్లు కదులుతుంటాయి. ఈ క్రమంలోనే ఈ హిమాలయన్​ ప్రాంతాల్లో ఉన్న దేశాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.

    More like this

    Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : యూఎస్‌(US), యూరోప్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. గురువారం ఉదయం...

    September 4 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 4 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 4,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Arikela Narsareddy | అరికెల నర్సారెడ్డికి ఘనంగా సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Arikela Narsareddy : నిజామాబాద్ పట్టణ మొటాడి రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు బుధవారం...