ePaper
More
    HomeతెలంగాణKaleshwaram | విద్యాసాగర్ బతికి ఉంటే కాళేశ్వరంలో దూకి సూసైడ్​ చేసుకునేవారు : సీఎం రేవంత్​

    Kaleshwaram | విద్యాసాగర్ బతికి ఉంటే కాళేశ్వరంలో దూకి సూసైడ్​ చేసుకునేవారు : సీఎం రేవంత్​

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Kaleshwaram : అసంపూర్తి సమాచారంతో హరీశ్​ రావు తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు Kaleshwaram project పై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ Justice PC Ghosh Commission ఇచ్చిన నివేదికపై ఆదివారం (ఆగస్టు 31) అసెంబ్లీలో Assembly  చర్చ నిర్వహించారు.

    ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్ల Pranahita Chevella లో నీరు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. హైడ్రాలజీ అనుమతులు ఇస్తున్నామని అక్టోబరు 24, 2014న అప్పటి కేంద్ర మంత్రి ఉమా భారతి Union Minister Uma Bharti చెప్పారని గుర్తుచేశారు.

    205 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని లేఖ ఇస్తే.. మళ్లీ పరిశీలించాలని హరీశ్​ రావు లేఖ రాశారన్నారు. ఇది ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ధ్రువపత్రం తీసుకున్నాక.. మళ్లీ పరిశీలించాలని అడిగినట్లు ఉందని సీఎం పేర్కొన్నారు.

    2009లో నీరు అందుబాటులో ఉందని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిచ్చిందని సీఎం రేవంత్​ తెలిపారు. ఈ దస్త్రాలను ఆనాటి బీఆర్​ఎస్​ సర్కారు కావాలనే దాచిపెట్టిందన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ Justice PC Ghosh Commission నివేదికలో నిజాలను బయటపెట్టారనే ఉద్దేశంతో ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారని సీఎం విమర్శించారు. హరీశ్​ రావు తప్పు చేశారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ Justice PC Ghosh Commission రిపోర్టులోని పేజీ నంబరు 98 లో పొందుపరిచారని సీఎం తెలిపారు.

    Kaleshwaram : సీబీఐ కావాలో..? సీబీసీఐడీ కావాలో.. తేల్చరే..

    ఇక కేసు విచారణ విషయానికి వస్తే.. విచారణకు సీబీఐ కావాలో..? సీబీసీఐడీ కావాలో.. ? చెప్పకుండా హరీశ్​రావు Harish Rao తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. పూర్తి సమాచారం లేకుండా.. తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన హరీశ్​ రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని సీఎం కోరారు.

    అప్పట్లో మంత్రిగా ఉన్న హరీశ్​రావు ఇప్పటికీ మంత్రి అనుకుంటున్నారని సీఎం ఎద్దేవా చేశారు. నీరు అందుబాటులో ఉందని చెప్పినా పున: పరిశీలించాలని లెటర్​ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఊరు మార్చి, పేరు మార్చి బీఆర్​ఎస్​ వారు దోపిడీకి పాల్పడ్డారని ముఖ్యమంత్రి ఆరోపించారు. విద్యాసాగర్ రావు గనుక నిజంగా ఇప్పటికీ బతికే ఉంటే బీఆర్​ఎస్​ వాళ్ల అబద్ధాలు వినలేక కాళేశ్వరంలో దూకి సూసైడ్​ చేసుకునేవారని సీఎం రేవంత్​ ఎద్దేవా చేశారు.

    More like this

    September 4 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 4 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 4,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Arikela Narsareddy | అరికెల నర్సారెడ్డికి ఘనంగా సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Arikela Narsareddy : నిజామాబాద్ పట్టణ మొటాడి రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు బుధవారం...

    corrupt revenue inspector | ఆ రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ మామూలోడు కాదు..

    అక్షరటుడే, ఇందూరు : corrupt revenue inspector | అవినీతికి కేరాఫ్​ అడ్రస్​గా ఉన్న ఆ ప్రభుత్వ ఉద్యోగి.....