ePaper
More
    HomeతెలంగాణTenth Topper | పక్కా ప్రణాళికతో చదివా.. సబ్జెక్టుల వారీగా నిత్యం సాధన చేశా.. టెన్త్​...

    Tenth Topper | పక్కా ప్రణాళికతో చదివా.. సబ్జెక్టుల వారీగా నిత్యం సాధన చేశా.. టెన్త్​ స్టేట్​ ఫస్ట్​ ర్యాంకర్​ క్రితి

    Published on

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Tenth Topper | పదో తరగతి ఫలితాల్లో నిజామాబాద్​ నగరానికి చెందిన కాకతీయ ఒలింపియాడ్ విద్యార్థిని క్రితి స్టేట్​ ఫస్ట్​ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. 596 మార్కులతో రాష్ట్రంలోనే టాపర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో విద్యార్థిని ‘అక్షరటుడే’తో తన మనోగతాన్ని పంచుకుంది. తాను రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడానికి దోహదపడిన అంశాలను వెల్లడించింది.

    Tenth Topper | సక్సెస్​ సీక్రెట్​ ఇదే..

    పక్కా ప్రణాళికతో చదవడం వల్లే స్టేట్​ ఫస్ట్​ ర్యాంకు సాధించగలిగానని విద్యార్థిని క్రితి తెలిపింది. “నాకు చిన్ననాటి నుంచి చదువంటే ఎంతో ఆస్తకి. సబ్జెక్టుల వారీగా టైంటేబుల్​ ఏర్పాటు చేసుకుని ప్రిపేర్​ అయ్యేదానిని. నిత్యం తెల్లవారుజాము నుంచే పుస్తకాలు పట్టేదాన్ని. అంతేకాకుండా పాఠశాలలో నిర్వహించే డెయిలీ టెస్టులు ఎంతో దోహదపడ్డాయి. దీంతో ఐదు సబ్జెక్టుల్లో వంద మార్కుల సాధించగలిగాను. కేవలం హిందీ సబ్జెక్టుల్లో మాత్రమే 96 మార్కులు వచ్చాయి. ప్రధానంగా ఇంటర్నల్స్​లో అన్ని సబ్జెక్టుల్లోనూ 20/20 వచ్చాయి..” అని తెలిపింది.

    Tenth Topper | అవి కూడా దోహదం చేశాయి

    చదువుతో పాటు పెయింటింగ్స్​ కూడా వేస్తాను. ఖాళీ సమయాల్లో పెయింటింగ్ వేయడం, వ్యాసరచన పోటీల్లో పాల్గొనడం హాబీగా మార్చుకున్నాను. అనేక సందర్భాల్లో వ్యాసరచన పోటీల్లోనూ బహుమతులు గెలుచుకున్నాను. నా పెయింటింగ్​ హాబీ రైటింగ్​ బాగా ఉండడానికి ఉపయోగపడింది. అలాగే ఇంగ్లిష్​లో కష్టతరమైన పదాలకు స్పెల్లింగ్స్ నిత్యం ప్రాక్టీస్​ చేసేదాన్ని. దీనివల్ల ఆంగ్లంపై బాగా పట్టు పెరిగింది.

    Tenth Topper | స్కూల్​లో నిత్యం పరీక్షలతో..

    నేను స్టేట్​ ఫస్ట్​ ర్యాంకు సాధించడానికి ‘కేవోఎస్​’లో చదవడం ఎంతో దోహదపడింది. అక్కడ​ నిత్యం స్లిప్​ టెస్టులు నిర్వహించేవారు. అలాగే ప్రత్యేకంగా స్టడీ అవర్స్​ ఉండేవి. వీటి వల్ల నేను అన్ని సబ్జెక్టుల్లో ప్రావీణ్యం సంపాదించాను. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చేవారు. అర్థం కాని అంశాలపై టీచర్లు ఓపికగా చెప్పేవారు. ఇక్కడి బోధనా విధానం రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించడానికి ఎంతగానో ఉపయోగపడింది.

    Tenth Topper | భవిష్యత్తులో వైద్యురాలుగా స్థిరపడతా..

    మా నాన్న కృష్ణ ఈఎన్టీ డాక్టర్. అమ్మ సృజన డెంటిస్ట్.  వారిద్దరూ వైద్యులైనా బిజీ లైఫ్ లోనూ ప్రోత్సహిస్తూ అండగా నిలిచారు. నేను కూడా భవిష్యత్తులో వైద్యురాలుగా స్థిరపడాలనేది లక్ష్యం. అదే దిశగా అడుగులు వేస్తున్నాను. క్రమశిక్షణ, పక్కా ప్రణాళికతో చదివి 590కి పైగా మార్కులు సాధించాను.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...