ePaper
More
    HomeసినిమాSalim Khan | గొడ్డు మాంసం తినం.. అన్ని మతాలని గౌర‌విస్తామంటూ స‌ల్మాన్ తండ్రి కామెంట్

    Salim Khan | గొడ్డు మాంసం తినం.. అన్ని మతాలని గౌర‌విస్తామంటూ స‌ల్మాన్ తండ్రి కామెంట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Salim Khan | బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) తండ్రి, ప్రముఖ సినీ రచయిత సలీం ఖాన్ తన కుటుంబ జీవనశైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, ఆహార‌పు అల‌వాట్లు, మ‌త సామరస్యం తదితర అంశాలపై భిన్న‌ అభిప్రాయాలను వెల్లడించారు.

    స‌లీం ఖాన్ (Salim Khan) మాట్లాడుతూ.. మేము ముస్లింలమే అయినా, మా ఇంట్లో గొడ్డు మాంసం ఎప్పుడూ తినలేదు. ఇండోర్ నుంచి ముంబయికి వచ్చిన తర్వాతా అదే పద్ధతి కొనసాగుతోంది,” అని అన్నారు. “బీఫ్ తినడం మా కుటుంబంలో పూర్తిగా నిషిద్ధం. మేము అలా పెరిగాం. గొర్రె మాంసం, చికెన్ (mutton and chicken) తిన్నాము కానీ బీఫ్‌కు మాత్రం ఎప్పుడూ దూరంగా ఉన్నాం అని చెప్పారు.

    Salman Khan | ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

    మహమ్మద్ ప్రవక్త బోధనల ప్రకారం, ఆవు పాలు (Cow Milk) తల్లి పాలతో సమానం. అందుకే ఆవును గౌరవిస్తాం. అదే కారణంగా బీఫ్‌కి దూరంగా ఉంటాం,” అని స్పష్టం చేశారు స‌లీం ఖాన్. అయితే, ఆహార విషయంలో ఎవరి ఇష్టం వాళ్లది. ఎవరు ఏది తినాలనుకుంటే, అది వారి స్వేచ్ఛ,” అని త‌న అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ, మా వీధిలో హిందూ పండుగలు (Hindhu Festivals) చాలా ఘనంగా జరుపుకునేవారు. మేమూ వాటిలో పాల్గొనేవాళ్లం. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆ ఉత్సవాల్లో భాగమయ్యేవారు,” అని అన్నారు.తన భార్య సుశీలను వివాహం చేసుకున్న సమయంలో కూడా కుటుంబంలో ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు.

    దీని వల్ల మా కుటుంబం అన్ని పండుగలను జరుపుకుంటూ , అన్ని సంప్రదాయాలను గౌర‌విస్తూ వ‌స్తున్నాం అని స్ప‌ష్టం చేశారు. ప్రతి సంవత్సరం లాగే, ఈసారి కూడా ఇంట్లో గణపతిని ప్రతిష్టించి పూజలు చేశాం. మేము అన్ని మతాలను గౌరవిస్తాం. ఈ భావన వల్లే మా కుటుంబం సఖ్యతగా, సంతోషంగా 60 ఏళ్లు కలిసి జీవిస్తోంది,” అని చెప్పారు. మొత్తంగా, సలీం ఖాన్ (Saleem Khan) వ్యాఖ్యలు భారతదేశం వంటి బహుళ మత సామరస్య దేశంలో సహన శీలత, పరస్పర గౌరవం, సంప్రదాయాల సమ్మిళిత జీవనవిధానంకు మంచి ఉదాహరణగా నిలుస్తున్నాయి.

    More like this

    Shilpa Shetty | రెస్టారెంట్ పూర్తిగా మూసివేయ‌డం లేదు.. అస‌లు విష‌యం ఇదేనంటున్న శిల్పా శెట్టి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Shilpa Shetty | బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి  తీసుకున్న తాజా నిర్ణయం సినీ,...

    Jharkhand | జార్ఖండ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు భ‌ద్ర‌తా సిబ్బంది మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Jharkhand | జార్ఖండ్‌లో తీవ్ర‌వాదుల‌తో జ‌రిగిన ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు భ‌ద్ర‌తా సిబ్బంది మృతి చెందారు....

    CM Tour | సీఎం పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు

    అక్షరటుడే, కామారెడ్డి/ఎల్లారెడ్డి : CM Tour | జిల్లాలో సీఎం పర్యటన కొనసాగనుంది. మరికొద్దిసేపట్లో ఆయన హెలికాప్టర్ ద్వారా...