ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Traffic Police | ఫిట్స్​తో పడిపోయిన వ్యక్తికి సపర్యలు చేసిన ట్రాఫిక్​ పోలీసులు

    Nizamabad Traffic Police | ఫిట్స్​తో పడిపోయిన వ్యక్తికి సపర్యలు చేసిన ట్రాఫిక్​ పోలీసులు

    Published on

    అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Nizamabad Traffic Police | ఫిట్స్ వచ్చి రోడ్డుపై ఓ వ్యక్తి పడిపోగా ట్రాఫిక్​ సిబ్బంది స్పందించారు. వెంటనే అతడికి సపర్యలు చేశారు. ఈ ఘటన ఆదివారం కంఠేశ్వర్​ టీ జంక్షన్​ (Kanteshwar T Junction) వద్ద చోటు చేసుకుంది.

    ట్రాఫిక్​ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కంఠేశ్వర్​ టీ జంక్షన్​ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫిట్స్​ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్​ ప్రసాద్ (Traffic Inspector Prasad) వెంటనే స్పందించారు. హెడ్​కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ శేఖర్ బాబు, దినేష్, మహిళా కానిస్టేబుల్ స్వప్న సదరు వ్యక్తికి సపర్యలు చేశారు. అనంతరం 108 అంబులెన్సును (108 Ambulance​) పిలిపించి చికిత్స నిమిత్తం జీజీహెచ్​కు (GGH Nizamabad) తరలించారు. సకాలంలో స్పందించిన ట్రాఫిక్ పోలీసులను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ అభినందించారు.

    More like this

    PM Modi | నేపాల్ యువతపై ప్రధాని మోదీ ప్రశంసలు.. రోడ్లపై పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారని వెల్లడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | యువత విధ్వంసంతో అల్లకల్లోలంగా నేపాల్ లో తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమితులైన...

    Lok Adalat | రాజీమార్గ‌మే రాజ‌మార్గం.. న్యాయమూర్తి సుష్మ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Lok Adalat | క‌క్షిదారుల‌కు రాజీమార్గ‌మే రాజ‌మార్గమని ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ(Judge...

    Kamareddy SP | ఆటోల చోరీ కేసులో అంతర్​ జిల్లా దొంగల అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | ఆటోల చోరీకి పాల్పడిన కేసులో ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్...