ePaper
More
    Homeఅంతర్జాతీయంIsrael | ఇజ్రాయిల్​లో భక్తిశ్రద్ధలతో వినాయకచవితి వేడుకలు

    Israel | ఇజ్రాయిల్​లో భక్తిశ్రద్ధలతో వినాయకచవితి వేడుకలు

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Israel | వినాయక నవరాత్రి ఉత్సవాలు దేశవిదేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా ఇజ్రాయిల్​లోనూ తెలుగువాళ్లు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ (Israel Telangana Association) ఆధ్వర్యంలో 11వ ఏడాది భక్తిశ్రద్ధలో వినాయక చవితి (vinayaka chavithi) వేడుకలను నిర్వహించారు.

    ఈ సందర్భంగా వినాయకుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural programs) నిర్వహించారు. చిన్నారులు భరతనాట్యం కూచిపూడి నృత్య ప్రదర్శనలిచ్చారు. హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలు ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా వెయ్యి మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు.

    గణపతి లడ్డూను (Ganapathi laddu) వేలంపాటలో కమ్మర్​పల్లికి (kammarpally) చెందిన గుగ్గిళ్ల దేవరాజ్ రూ.52వేలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయ (Indian Embassy) అధికారి శ్రీధర్ దంపతులు, ఇండియన్ కల్చరల్ సెంటర్ (Indian Cultural Center) డైరెక్టర్ సయాని నారాయణ్, అసోసియేషన్ అధ్యక్షుడు సోమరవి, ఉపాధ్యక్షుడు రాకేష్, కోశాధికారి చాట్ల సాయి కుమార్, బోర్డు మెంబర్ బొమ్మకంటి మహేష్ గౌడ్, నవీన్, ఎల్లె ప్రసాద్, మల్లెల గంగాధర్, సత్య ప్రసాద్, పి.చిన్నయ్య, జగన్, నగేష్, శివ రావు, రీగల్ దూడ రవి, సాక్షి గంగాధర్, బాబూరావు, సునీల్​, కొమ్ముల శంకర్​ తదితరులు పాల్గొన్నారు.

    లడ్డూను దక్కించుకున్న కమ్మర్​పల్లికి చెందిన గుగ్గిళ్ల దేవరాజ్

    More like this

    September 4 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 4 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 4,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Arikela Narsareddy | అరికెల నర్సారెడ్డికి ఘనంగా సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Arikela Narsareddy : నిజామాబాద్ పట్టణ మొటాడి రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు బుధవారం...

    corrupt revenue inspector | ఆ రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ మామూలోడు కాదు..

    అక్షరటుడే, ఇందూరు : corrupt revenue inspector | అవినీతికి కేరాఫ్​ అడ్రస్​గా ఉన్న ఆ ప్రభుత్వ ఉద్యోగి.....