అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం (Telangana Beedi Workers’ Union), బీఎల్టీయూ (BLTU) ఆధ్వర్యంలో నగరంలో మహాసభలు నిర్వహించనున్నట్లు బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాములు పేర్కొన్నారు.
ఈ మేరకు ఆదివారం సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 11, 12 తేదీల్లో నగరంలో పాత కలెక్టరేట్ గ్రౌండ్లో (Collectorate Ground) మహాసభల్లో భాగంగా భారీ బహిరంగ సభ ఉంటుందని వివరించారు. అంతకంటే ముందుగా తిలక్గార్డెన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.
12వ తేదీన న్యూ అంబేడ్కర్ భవన్లో (New Ambedkar Bhavan) ప్రతినిధుల మహాసభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మొదటి రోజు బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, అతిథులుగా బీఎల్ఎఫ్ ఛైర్మన్ నల్ల సూర్య ప్రకాష్, కవి, రచయిత జయరాజ్, గాయకులు ఏపూరి సోమన్న, కవి, రచయిత జూపాక సుభద్ర, వక్తలుగా బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్, ఆంజనేయులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.