అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kaleshwaram Report | కాళేశ్వరం కమిషన్ నివేదిక (Kaleshwaram Commission Report)పై ఆదివారం అసెంబ్లీ (Assembly)లో చర్చ జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు చర్చ ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తెలిపారు.
కాళేశ్వరం కమిషన్ నివేదిక, బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై చర్చించడానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలిరోజు.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతికి సభ్యులు సంతాపం తెలిపారు. అనంతరం సభను వాయిదా వేశారు.
Kaleshwaram Report | సభలో మాట్లాడతాం..
అసెంబ్లీ వద్ద ఆదివారం మంత్రి ఉత్తమ్ మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. స్పీకర్ కాళేశ్వరం నివేదికను టేబుల్ చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలకు కూడా కాపీలను పంపించామన్నారు. కాళేశ్వరంపై అన్ని విషయాలను సభలో మాట్లాడతామన్నారు. కాగా.. మంత్రి ఉత్తమ్ కాళేశ్వరం నివేదికను సభలో ప్రవేశ పెడతారు. అనంతరం ఆయన దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
Kaleshwaram Report | బీసీ బిల్లు ప్రవేశ పెట్టిన ప్రభుత్వం
అసెంబ్లీలో మంత్రి సీతక్క (Minister Seethakka) బీసీ బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిపై చర్చ జరుగుతోంది. అయితే సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం కొద్దిసేపు సభలో ఉండి అనంతరం కేరళ వెళ్లారు. సాయంత్రం ఆయన కాళేశ్వరంపై చర్చలో పాల్గొనడానికి రానున్నారు. రాత్రి వరకు సభ సాగే అవకాశం ఉంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు బీసీ బిల్లు విషయంలో తీవ్ర చర్చ జరుగుతోంది. కాళేశ్వరం నివేదికపై చర్చ చేపట్టి బీఆర్ఎస్ను ఇరాకటంలో పడేయాలని ప్రభుత్వం చూస్తోంది. అయితే చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొంటారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.