అక్షర టుడే, ఇందూరు: BJP Nizamabad | కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో ఉంచుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు (Nyalam Roju) హెచ్చరించారు.
జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ (Nizamabd Railway Station) ఎదుట ఆదివారం రాహుల్ గాంధీ (Rahul Gandhi) దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ (PM Modi), ఆమె తల్లిపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.
ఓట్ల కోసం బీసీలను కించపరిచినట్లు మాట్లాడటం తగదని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలన గాలికొదిలేసి ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి బీసీ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని వారు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రధాని మోడీ, ఆమె తల్లి గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దిష్టిబొమ్మ దహనం చేసే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు తోపులాట జరిగింది. కార్యక్రమంలో జిల్లా నాయకులు, నగర, మండల నాయకులు పాల్గొన్నారు .