ePaper
More
    Homeక్రైంNizamabad | ఇంటిపై ప్రమాదకరంగా విద్యుత్​ తీగలు.. కరెంట్​ షాక్​తో పెయింటర్​ మృతి

    Nizamabad | ఇంటిపై ప్రమాదకరంగా విద్యుత్​ తీగలు.. కరెంట్​ షాక్​తో పెయింటర్​ మృతి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్​ తీగలు (Electric wires) ప్రమాదకరంగా మారాయి. ఇళ్ల మీద నుంచి కరెంట్ తీగలు వెళ్తుండటంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు.

    నిజామాబాద్ నగరంలోని (Nizamabad City) ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సీతారాం నగర్ కాలనీలో ఓ పెయింటర్​ విద్యుత్​ షాక్​తో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.

    కాలనీలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. పనులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర (Maharashtra) నుంచి వలస వచ్చిన నాందేవ్​ (45) ఆ ఇంటికి పెయింటింగ్​ వేయడానికి వచ్చాడు. అయితే ఇంటిపైన విద్యుత్​ తీగలు ఉన్నాయి. నాందేవ్ ప్రమాదవశాత్తు వాటికి తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై గంగాధర్​ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

    More like this

    MLC Kavitha | ఆడ‌త‌న‌మే శాప‌మా? రాజ‌కీయ వార‌స‌త్వంలోనూ కొడుకుల‌కే పెద్ద‌పీట‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MLC Kavitha | తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ క‌విత ఎపిసోడ్ తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పార్టీ...

    Shilpa Shetty | రెస్టారెంట్ పూర్తిగా మూసివేయ‌డం లేదు.. అస‌లు విష‌యం ఇదేనంటున్న శిల్పా శెట్టి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Shilpa Shetty | బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి  తీసుకున్న తాజా నిర్ణయం సినీ,...

    Jharkhand | జార్ఖండ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు భ‌ద్ర‌తా సిబ్బంది మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Jharkhand | జార్ఖండ్‌లో తీవ్ర‌వాదుల‌తో జ‌రిగిన ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు భ‌ద్ర‌తా సిబ్బంది మృతి చెందారు....