ePaper
More
    HomeతెలంగాణLocal Body Elections | త్వరలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్​.. మంత్రి కీలక వ్యాఖ్యలు

    Local Body Elections | త్వరలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్​.. మంత్రి కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నిక​ల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ ప్రక్రియను వేగవంతం చేసింది.

    రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆదివారం ఆయన మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు. సెప్టెంబర్​ 10 తర్వాత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) విడుదల అవుతుందని ఆయన తెలిపారు. సెప్టెంబర్​ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి, తర్వాత సర్పంచ్​ ఎలక్షన్లు పెడుతామన్నారు.

    Local Body Elections | ఎన్నికల సంఘం అడుగులు

    స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం (SEC) అడుగులు వేస్తోంది. ఇప్పటికే పంచాయతీ ఓటర్ల జాబితా కోసం నోటిఫికేషన్​ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. శనివారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటరు జాబితా కోసం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్​ 6న ఓటరు జాబితా ముసాయిదా ప్రతి విడుదల చేయాలని, అనంతరం అభ్యంతరాలు స్వీకరించి అదే నెల 10న తుది ఓటరు జాబితా, పోలింగ్​ స్టేషన్ల వివరాలు వెల్లడించాలని ఆదేశించింది.

    Local Body Elections | ఆశావహుల్లో ఉత్కంఠ

    రాష్ట్రంలో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం పూర్తయి ఏడాదిన్నర అవుతోంది. అప్పటి నుంచి గ్రామాలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ టర్మ్​ అయిపోయి కూడా ఏడాది దాటింది. దీంతో గ్రామాల్లో పాలన అస్తవ్యస్తం అయింది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల కోసం ప్రజలతో పాటు, నాయకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

    స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి పలువురు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎన్నికల తేదిపై స్పష్టత లేకపోవడంతో ఏ రిజర్వేషన్​ (Reservations) ఖరారు అవుతుందో తెలియక వారు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మంత్రి ఈ నెలలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడంతో ఆశావహులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రిజర్వేషన్లు ఖరారు అయితే పోటీలో దిగే అభ్యర్థులు ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం ఉంది.

    More like this

    Local Body Elections | బీజేపీలో టికెట్ల కోసం పోటీ.. కోర్ క‌మిటీదే తుది నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Local Body Elections | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ...

    Tallest Ganesh | ప్ర‌పంచంలోనే ఎత్తైన గ‌ణేష్ విగ్ర‌హం ఎక్క‌డ ఉంది.. దాని ఎత్తు ఎన్ని అడుగులు అంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tallest Ganesh | దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మామూలుగా లేదు. ప్రతి ఊరు,...

    CM Revanth Reddy | రేపు కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

    అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy | కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. ఆయన...