అక్షరటుడే, వెబ్డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటీవల భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. ఆగస్టు 26 రాత్రి నుంచి 28 వరకు కుండపోత వానలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
ఇటీవల కురిసిన వర్షాలు, వరదల నుంచి ప్రజలు ఇంకా కోలుకోనే లేదు. పలు గ్రామాలకు రాకపోకలు ఇంకా ప్రారంభం కాలేదు. తాత్కాలిక మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Rain Alert | ఆ జిల్లాలకు అలర్ట్
కామారెడ్డి (Kamareddy), మెదక్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో ఇటీవల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా మెదక్ (Medak), కామారెడ్డిలో జలప్రళయం వచ్చింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆదివారం నుంచి సెప్టెంబర్ 1 వరకు పలు జిల్లాల్లో కుండపోత వాన పడుతుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
Rain Alert | సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు
అల్ప పీడన ప్రభావంతో సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు పలు జిల్లాలో అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
Rain Alert | హైదరాబాద్ నగరంలో..
హైదరాబాద్ (Hyderabad) నగరంలో నేటి సెస్టెంబర్ వరకు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో రాత్రిపూట వర్షం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సెప్టెంబర్ 11 నుంచి మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Rain Alert | అప్రమత్తంగా ఉండాలి
ఇటీవల భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలం అయ్యారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరదల ధాటికి పలువురు మృతి చెందారు. ఇప్పటికే చెరువులు, జలాశయాలు నిండి ఉండటంతో వర్షాలు పడితే వరద ఉప్పొంగే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. వర్షం పడే సమయంలో ఇళ్లలోనే ఉండాలి. ప్రయాణాలు చేయకపోవడం మేలు.