అక్షరటుడే, వెబ్డెస్క్: America | అమెరికాలోని ఫ్లోరిడాలో (Florida) గల స్టాన్ఫోర్డ్ నగరంలో గణేశ్ నిమజ్జనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
స్టాన్ఫోర్డ్లో నివసిస్తున్న తెలుగు వారు వినాయకుడిని ప్రతిష్ఠించి ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు (special pujas) చేశారు. ప్రతి రోజు సాయంత్రం అన్నదానం నిర్వహించారు.
స్థానికంగా అందరూ కలిసి ప్రతిష్ఠించిన వినాయకుడితో పాటు ఇళ్లలో పూజలు చేసిన గణనాథులను సైతం నిమజ్జనం చేశారు. పాటలు, నృత్యాలతో నిమజ్జన శోభాయాత్ర (Shobhayatra) ఘనంగా నిర్వహించారు.