ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Janasena Party | కూట‌మి 15 ఏళ్ల పాటు కొన‌సాగాలన్న ప‌వ‌న్.. వీరమహిళలకు పార్టీ పదవుల్లో...

    Janasena Party | కూట‌మి 15 ఏళ్ల పాటు కొన‌సాగాలన్న ప‌వ‌న్.. వీరమహిళలకు పార్టీ పదవుల్లో 33 శాతం రిజర్వేషన్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Janasena Party | ఆంధ్రప్రదేశ్‌లో చారిత్రక విజయం సాధించిన అనంతరం జనసేన పార్టీ (Janasena Party) తన భవిష్యత్ ప్రణాళికని ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో (Visakhapatnam) జరిగిన ‘సేనతో సేనాని’ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

    పార్టీని స్థిరంగా, సంస్థాగతంగా బలోపేతం చేయడమే కాకుండా, రాబోయే పదేళ్లకు యువ నాయకత్వాన్ని సిద్ధం చేయడమే లక్ష్యంగా తీసుకున్న దిశానిర్ణయాలను వెల్లడించారు. పార్టీ ఆవిర్భావం వెనుక తన మనసులోని భావోద్వేగాలను కార్యకర్తలతో పంచుకున్న పవన్ కల్యాణ్, జనసేన ఒక కులం, కుటుంబం, ప్రాంతానికి సంబంధించిన పార్టీ కాదని, ప్రజల బాధ, ఆవేదనల నుంచి జన్మించిన ఉద్యమమని చెప్పారు.

    Janasena Party | కీల‌క వ్యాఖ్య‌లు

    “గత 11 ఏళ్లుగా నా వ్యక్తిగత జీవితం, సినిమాలను పక్కన పెట్టి పార్టీ కోసమే అంకితభావంతో పని చేశాను. ఎన్నో అవమానాలు ఎదురైనా, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం వల్లే ఈ రోజు శతవిజయాన్ని సాధించాం. పోటీ చేసిన ప్రతీచోట గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాం” అని పవన్ (Pawan Kalyan) గుర్తుచేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలపరచేందుకు పవన్ కల్యాణ్ “త్రిశూల్” పేరుతో కొత్త కార్యక్రమాన్ని దసరా (Dussehra) తర్వాత ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా పార్టీలోని ప్రతి క్రియాశీల సభ్యుడు పార్టీ సెంట్రల్ కమిటీతో నేరుగా అనుసంధానమవుతాడు. 2030 నాటికి రాష్ట్రానికి శక్తివంతమైన నాయకత్వాన్ని అందించడం లక్ష్యంగా యువతకు శిక్షణ, అవకాశాలు కల్పిస్తారు.

    వీరమహిళలకు పార్టీలో 33 శాతం ప్రాతినిధ్యం కల్పించనున్నట్టు స్పష్టం చేశారు. క్రమశిక్షణ, అంకితభావం ఉంటే ఎవరైనా నాయకత్వ స్థాయికి ఎదగవచ్చు. నాయకత్వం అనేది పదవుల్లో కాదు, బాధ్యతల్లో ఉంటుంది” అంటూ యువతకు పవన్ సందేశం ఇచ్చారు.ప్రస్తుత ఎన్డీయే NDA కూటమి గురించి మాట్లాడుతూ, “రాష్ట్రానికి సుస్థిర పాలన అందించాలంటే కనీసం 15 ఏళ్ల పాటు కూటమి కొనసాగాలి.

    ఒకవేళ మేమే బలహీనపడితే, మళ్లీ అరాచక పాలన తిరిగొస్తుంది,” అని హెచ్చరించారు.భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలుంటే, అవి లోలోప‌లే పరిష్కరించుకోవాలని సూచించారు. “2019-24 మధ్య ఎన్నో కష్టాలు ఎదురైనా, మేము ఎప్పుడూ కేంద్రం సహాయం కోరలేదు. ఆత్మగౌరవంతోనే ముందుకు వచ్చాం,” అని పవన్ గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు. ప్రజాసేవ. నిస్వార్థంగా పనిచేస్తే, ఫలితాలు ఆటోమేటిగ్గా వస్తాయి, అంటూ కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

    More like this

    MLC Kavitha | ఆడ‌త‌న‌మే శాప‌మా? రాజ‌కీయ వార‌స‌త్వంలోనూ కొడుకుల‌కే పెద్ద‌పీట‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MLC Kavitha | తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ క‌విత ఎపిసోడ్ తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పార్టీ...

    Shilpa Shetty | రెస్టారెంట్ పూర్తిగా మూసివేయ‌డం లేదు.. అస‌లు విష‌యం ఇదేనంటున్న శిల్పా శెట్టి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Shilpa Shetty | బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి  తీసుకున్న తాజా నిర్ణయం సినీ,...

    Jharkhand | జార్ఖండ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు భ‌ద్ర‌తా సిబ్బంది మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Jharkhand | జార్ఖండ్‌లో తీవ్ర‌వాదుల‌తో జ‌రిగిన ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు భ‌ద్ర‌తా సిబ్బంది మృతి చెందారు....