ePaper
More
    HomeతెలంగాణBC Minister Ponnam | అసెంబ్లీ సాక్షిగా మంత్రి పొన్నం ప్రభాకర్​కు అవమానం!

    BC Minister Ponnam | అసెంబ్లీ సాక్షిగా మంత్రి పొన్నం ప్రభాకర్​కు అవమానం!

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: BC Minister Ponnam | తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు ఘోర అవమానం జరిగింది.

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief Minister Revanth Reddy కోసం కేటాయించిన లిఫ్టులో ఎక్కేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్​ గౌడ్​కు అనుమతించలేదనే ప్రచారం జరుగుతోంది. కాగా.. అదే లిఫ్టులోకి తర్వాత పొంగులేటిని అనుమతించినట్లు తెలిసింది. ఈ విషయం అసెంబ్లీలో చర్చనీయాంశంగా మారింది.

    BC Minister Ponnam | అసలేం జరిగిందంటే..

    మంత్రి వర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీకి (Assembly ) వచ్చారు. శాసనసభ ఆవరణలో లిఫ్టు ఎక్కే ప్రయత్నం చేశారు. అయిదే ఆ లిఫ్టు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి కోసం కేటాయించిందని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. వేరే లిఫ్టులో వెళ్లాలని సెక్యూరిటీ సిబ్బంది సూచించినట్లు సమాచారం.

    దీంతో మంత్రి పొన్నం వేరే లిఫ్టులో వెళ్లిపోయారు. అయితే తర్వాత అదే లిఫ్టులో పొంగులేటి Ponguleti రావడం చూసి మంత్రి పొన్నం ప్రభాకర్ షాకయ్యారు. వెంటనే పొన్నం కిందికి వెళ్లారు. తనను వద్దని లిఫ్టులో పొంగులేటికి ఎలా అనుమతి ఇచ్చారని సెక్యూరిటీ సిబ్బందిని నిలదీసినట్లు తెలిసింది.

    ఇద్దరం సమాన హోదాలోనే ఉన్నాం కదా అని సెక్యూరిటీ సిబ్బందిపై మంత్రి పొన్నం మండిపడ్డారు. బీసీ మంత్రి కాబట్టే వివక్ష చూపుతున్నారని అక్కడున్న పలువురు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

    More like this

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సైపై వేటు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...