ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Flood troubles | నాలాల ఆక్రమణలతోనే వరద కష్టాలు.. మీడియాతో కామారెడ్డి వాసులు

    Kamareddy Flood troubles | నాలాల ఆక్రమణలతోనే వరద కష్టాలు.. మీడియాతో కామారెడ్డి వాసులు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Flood troubles | కుండపోత వర్షం కామారెడ్డి ప్రజలకు (Kamareddy People) కన్నీళ్లు మిగిల్చింది. వరదలతో పట్టణం అల్లకల్లోలంగా మారింది.

    కామారెడ్డి ఎత్తయిన ప్రదేశంలో ఉంటుందని, ఇక్కడ వరదలు వచ్చే అవకాశం లేదని భావించిన ప్రజలకు భారీ వరదలు (heavy floods) ఉలిక్కిపడేలా చేశాయి.

    Kamareddy Flood troubles | కబ్జాలే కారణం..

    కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా నుంచి జీవదాన్ పాఠశాలకు వెళ్లే దారిలో 40 ఫీట్ల పొడవైన నాలాను ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం వల్లే వరదలు వచ్చాయని స్థానికులు తెలిపారు.

    నిజాంసాగర్ Nizamsagar చౌరస్తా రహదారిలో శనివారం (ఆగస్టు 30) మీడియాతో మాట్లాడారు. మాస్టర్ ప్లాన్​లో ఉన్న విధంగా 40 ఫీట్ల రోడ్డు ఎక్కడ ఉందని ప్రశ్నించారు.

    జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం సందర్శించి 40 ఫీట్ల నాలాలలో ఎలాంటి ఆక్రమణలు జరిగాయో చూడాలని కోరారు.

    వర్షాలు పడ్డప్పుడు మాత్రమే స్పందించే యంత్రాంగం దీనికి కారకులైన వారి పైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని Kamareddy పట్టణ వాసులు వాపోయారు.

    ప్రత్యక్ష నిదర్శనంగా నాలాపైన పెద్ద పెద్ద భవనాలు కట్టినట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఆ వైపు తొంగి చూడటానికే అధికార యంత్రాంగం భయభ్రాంతులకు గురవుతోందన్నారు.

    కోట్లాది రూపాయల ఆస్తి నష్టానికి ప్రత్యక్ష, పరోక్ష కారకులు అధికార యంత్రాంగమేనని పట్టణవాసులు ఆరోపించారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో మాస్టర్ ప్లాన్​లో ఉన్న విధంగా నాలాలను సరిచేయాలన్నారు.

    నాలాలను ఆక్రమించిన వారి భవనాలను తొలగిస్తే కామారెడ్డికి ముప్పు రాకుండా ఉంటుందన్నారు. బాలు, ముత్యపు చక్రపాణి, కస్వ రమేష్, గంప ప్రసాద్, కృష్ణమూర్తి, రాజశేఖర్ తదితరులున్నారు.

     

    More like this

    GST slabs | వినియోగదారులకు గుడ్​న్యూస్​.. జీఎస్టీలో ఇకపై రెండు స్లాబులే.. త‌గ్గ‌నున్న ప‌న్నుల భారం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: GST slabs | వ‌స్తు సేవ‌ల ప‌న్ను (జీఎస్టీ)లో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. 79వ స్వాతంత్య్ర...

    Vinayaka Navratri celebrations | వినాయక నవరాత్రుల సంబరాలు.. లంబోదరుడి సేవలో భక్తజనం!

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka Navratri celebrations : నిజామాబాద్​ నగరంలో గణేశ్​ నవరాత్రి వేడుకలు సంబరంగా కొనసాగుతున్నాయి. వినాయక...

    Uric Acid | యూరిక్ యాసిడ్ సమస్యతో నరకం చూస్తున్నారా..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Uric Acid | చాలామందిని వేధించే ఆరోగ్య సమస్యల్లో (health problems) యూరిక్ యాసిడ్ ఒకటి....