ePaper
More
    Homeభక్తిLunar eclipse | చంద్ర గ్రహణం.. శ్రీవారి ఆలయం మూసివేత.. ఎప్పుడంటే..

    Lunar eclipse | చంద్ర గ్రహణం.. శ్రీవారి ఆలయం మూసివేత.. ఎప్పుడంటే..

    Published on

    అక్షరటుడే, తిరుమల: Lunar eclipse : చంద్ర గ్రహణం రాబోతోంది. సెప్టెంబరు 7న చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. ఈ నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి ఆలయం (Srivari temple) మూసివేయనున్నారు.

    12 గంటల పాటు వేంకటేశ్వర స్వామి ఆలయ (Venkateswara Swamy temple) మహద్వారం తలుపులను మూసివేస్తారు.

    ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే 8వ తేదీ వేకువజామున 1.31 గంటలకు గ్రహణం వీడనుంది.

    ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీవారి ఆలయం మూసివేస్తారు. మరుసటి రోజు అంటే 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు శ్రీవారి ఆలయం మూసి ఉంటుంది.

    Lunar eclipse : సుప్రభాత సేవతో..

    సుప్రభాతం (Suprabhata Seva) తో ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. శుద్ధి, పుణ్యాహవచనం తర్వాత ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం పున: ప్రారంభవుతుంది.

    చంద్ర గ్రహణం నేపథ్యంలో తిరుమలలో అన్నప్రసాదాల వితరణ కూడా నిలిచిపోనుంది. చంద్ర గ్రహణం అనంతరం 8వ తేదీ ఉదయం 8.30 గంటలకు ప్రసాదాల వితరణ ప్రారంభమవుతుంది.

    చంద్ర గ్రహణం సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ TTD వెల్లడించింది.

    30 వేల పులిహోర ప్యాకెట్లను సిద్ధం చేయబోతున్నారు.  వీటిని 7వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుంచి భక్తులకు పంపిణీ చేయనున్నారు.

    More like this

    corrupt revenue inspector | ఆ రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ మామూలోడు కాదు..

    అక్షరటుడే, ఇందూరు : corrupt revenue inspector | అవినీతికి కేరాఫ్​ అడ్రస్​గా ఉన్న ఆ ప్రభుత్వ ఉద్యోగి.....

    GST slabs | వినియోగదారులకు గుడ్​న్యూస్​.. జీఎస్టీలో ఇకపై రెండు స్లాబులే.. త‌గ్గ‌నున్న ప‌న్నుల భారం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: GST slabs | వ‌స్తు సేవ‌ల ప‌న్ను (జీఎస్టీ)లో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. 79వ స్వాతంత్య్ర...

    Vinayaka Navratri celebrations | వినాయక నవరాత్రుల సంబరాలు.. లంబోదరుడి సేవలో భక్తజనం!

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka Navratri celebrations : నిజామాబాద్​ నగరంలో గణేశ్​ నవరాత్రి వేడుకలు సంబరంగా కొనసాగుతున్నాయి. వినాయక...