అక్షరటుడే, ఎల్లారెడ్డి : Former MLA Jajala Surender : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మేఘ విస్పోటనం జరిగింది. ఫలితంగా భారీగా కురిసిన వర్షాలతో వాగులు పొంగిపోర్లాయి. చెరువులు తెగిపడ్డాయి.
Yellareddy constituencyలో ముంచుకొచ్చిన వరద బీభత్సం సృష్టించింది. జన జీవనాన్న అతలాకుతలం చేసింది. ఊర్లను ఏరులుగా మార్చింది. సామాన్యులను ఆగం చేసింది.
భారీ వరద ఉగ్రరూపం దాల్చి ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 103 సంవత్సరాల చరిత్ర గల పోచారం జలాశయానికి చేరింది. ప్రాజెక్టు నిండిపోయి ఎనిమిది అడుగుల ఎత్తు పైనుంచి ఉప్పొంగి ప్రవహించింది.
Former MLA Jajala Surender : అమ్మవారి దయ..
వరద ఉద్ధృతికి అలుగు వద్ద తీవ్ర నష్టమే వాటిల్లింది. ఈ నేపథ్యంలో శనివారం (ఆగస్టు 30) గంగమ్మ తల్లికి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మొక్కుకున్నారు.
వరద వల్ల పోచారం ప్రాజెక్టు (Pocharam reservoir) కు ఎలాంటి నష్టం జరగకుండా రక్షించాలని జాజాల సురేందర్ వేడుకున్నారు.
అమ్మవారి దయవల్లే ప్రాజెక్టు సురక్షితంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంను నమ్ముకుంటే ప్రజలనే కాదు.. అన్నిటినీ ముంచేస్తారని అన్నారు.