ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Nandamuri Balakrishna donation | వరద బాధిత రైతులకు అండగా బాలయ్య.. భారీ విరాళం ప్రకటన

    Nandamuri Balakrishna donation | వరద బాధిత రైతులకు అండగా బాలయ్య.. భారీ విరాళం ప్రకటన

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nandamuri Balakrishna donation : అతి భారీ వర్షాలు, వరదలతో తెలంగాణలోని పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో పొలాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.

    దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొలాల్లో ఇసుక మేటలు వేసింది. ఇప్పట్లో ఇసుక మేటలు తొలగే పరిస్థితి కనబడటం లేదు. రైతులకు జరిగిన నష్టంపై ఆయా జిల్లాల అధికారులు ఇప్పటికే ప్రాథమిక అంచనాకు వచ్చారు.

    ఇదిలా ఉండగా.. అతి భారీ వర్షాలు, ముంచుకొచ్చిన వరదలు రైతుల జీవితాలను అతలాకుతలం చేశాయి. కర్షకుల దుస్థితి చూసిన సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్​లోని హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌ చలించిపోయారు.

    Nandamuri Balakrishna donation : ఏకంగా రూ. 50 లక్షలు..

    క్లిష్ట పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు Nandamuri Balakrishna. రైతుల కోసం భారీగా విరాళం ప్రకటించారు. ఏకంగా రూ. 50 లక్షలు ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు.

    టాలీవుడ్​ క‌థానాయ‌కుడు నందమూరి బాలకృష్ణ.. 50 ఏళ్ల సుదీర్ఘ ప్ర‌స్థానం పూర్తి చేసుకొన్న ఏకైక న‌టుడిగా వ‌ర‌ల్డ్ బుక్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు.

    ఈ నేపథ్యంలో వ‌ర‌ల్డ్ బుక్ రికార్డ్స్ World Book Records సంస్థ శనివారం (ఆగస్టు 30) హైద‌రాబాద్​లో బాల‌య్య‌ని స‌త్క‌రించింది. ఈ సందర్భంగా నందమూరి బాల‌య్య మాట్లాడారు.

    కామారెడ్డి, జ‌గిత్యాల‌లో వ‌ర‌ద‌ల వ‌ల్ల చాలామంది న‌ష్ట‌పోయార‌ని Film actor బాలయ్య గుర్తుచేశారు. వరదలతో అపార పంట న‌ష్టం వాటిల్లింద‌ని పేర్కొన్నారు.

    నష్టపోయిన రైతులకు తన వంతుగా రూ. 50 లక్షలు సాయం చేస్తానని ప్రకటించారు. ఇది కేవలం ఉడ‌తాభ‌క్తి సాయ‌మని పేర్కొన్నారు. ఇకపై ఇలానే త‌న వంతు సహాయ, సహకారాలు అందిస్తాన‌ని బాలయ్య హామీ ఇచ్చారు.

    వ‌ర‌ల్డ్ రికార్డ్ సంద‌ర్భంగా బాలయ్యను సంస్థ వారు స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మం అంతా పూర్తయ్యాక నందమూరి బాలకృష్ణ ఈ సాయం ప్ర‌క‌ట‌న చేశారు.

    Nandamuri Balakrishna donation : రాజకీయాల కోసం కాదు..

    విరాళం ప్రకటించాక మరో మాట కూడా అన్నారు. విరాళాలు ప్ర‌క‌టించి, దానిని రాజ‌కీయాల‌కు వాడుకొనే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. అందుకే కార్యక్రమం అంతా అయిపోయాక ప్రకటిస్తున్నట్లు బాలయ్య చెప్పుకొచ్చారు.

    ఆంధ్ర‌ప్ర‌దేశ్​లో తెలుగు సినిమాల Telugu films అభివృద్దికి ఏపీ సర్కారు కృషి చేయాల‌ని బాలయ్య కోరారు. అక్క‌డ మౌళిక వ‌స‌తులు క‌ల్పించి, క‌ళాకారుల‌కు జీవ‌నోపాధి కల్పించాలన్నారు.

    ఆస్కార్ స్థాయికి తెలుగు చిత్ర‌సీమ Telugu film industry వెళ్లింద‌ని బాలయ్య పేర్కొన్నారు. ఈ సంవత్సరం త‌న‌కు బాగా క‌లిసొచ్చినట్లు తెలిపారు. ఇటీవల నాలుగు విజ‌యాలు వరుసగా ద‌క్కాయ‌న్నారు. దేశ అత్యున్నత పురస్కారం ప‌ద్మ భూష‌ణ్ దక్కిందన్నారు.

    అన్ స్టాప‌బుల్ షో Unstoppable show భారత్​లోనే నెంబ‌ర్ వన్ షోగా వెలుగుతున్నట్లు బాలయ్య తెలిపారు. భ‌గ‌వంత్ కేస‌రి మూవీకి జాతీయ అవార్డు ద‌క్కింద‌న్నారు. ఇదే సమయంలో తన 50 ఏళ్ల ప్ర‌స్థానం పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.

    Latest articles

    Shiva Worship | పాపాలను హరించే ప్రదోష పూజ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shiva Worship | హిందూ ధర్మం (Hindu Dharma) ప్రకారం శివారాధనకు ప్రదోష(Pradosha) సమయం...

    September 1 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 1 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 1,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...

    BRS MLAs boycott assembly | భారాస ఎమ్మెల్యేల అసెంబ్లీ బైకాట్​.. ఘోష్ కమిషన్ రిపోర్టు చించివేత

    అక్షరటుడే, హైదరాబాద్: BRS MLAs boycott assembly : పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ...

    Malaysia Telugu people | మలేసియాలో తెలుగు వారితో నటులు మురళీ మోహన్​, ప్రదీప్​ విందు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Malaysia Telugu people : మాజీ ఎంపీ, తెలుగు నటులు Telugu actors మాగంటి మురళీ...

    More like this

    Shiva Worship | పాపాలను హరించే ప్రదోష పూజ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shiva Worship | హిందూ ధర్మం (Hindu Dharma) ప్రకారం శివారాధనకు ప్రదోష(Pradosha) సమయం...

    September 1 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 1 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 1,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...

    BRS MLAs boycott assembly | భారాస ఎమ్మెల్యేల అసెంబ్లీ బైకాట్​.. ఘోష్ కమిషన్ రిపోర్టు చించివేత

    అక్షరటుడే, హైదరాబాద్: BRS MLAs boycott assembly : పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ...