అక్షర టుడే, బాల్కొండ: Balkonda Mandal | మండలంలోని బుస్సాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (Bussapur Government Primary School) హెచ్ఎం ద్యావతి రాజారాం ఉద్యోగ విరమణ పొందారు. దీంతో శనివారం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ఎంఈవో బట్టు రాజేశ్వర్ (MEO Battu Rajeshwar) హాజరై మాట్లాడారు. రాజారాం సేవలను విద్యాశాఖతో పాటు పాఠశాల మర్చిపోలేదన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్, వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.