ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad CP | ఉమ్మెడ వినాయక నిమజ్జన ఘాట్​ను పరిశీలించిన సీపీ

    Nizamabad CP | ఉమ్మెడ వినాయక నిమజ్జన ఘాట్​ను పరిశీలించిన సీపీ

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Nizamabad CP | నందిపేట మండలం ఉమ్మడ వంతెన (Ummeda bridge) వద్ద ఏర్పాటు చేసిన గణేశ్​ నిమజ్జన స్థలాన్ని శనివారం సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) పరిశీలించారు. నిమర్జన ఘాట్​ వద్ద ఏర్పాటు చేసిన లైటింగ్, క్రేన్, వైద్య సదుపాయాలు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్ల వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు.

    Nizamabad CP | శాంతియుతంగా జరుపుకోవాలి

    వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని సీపీ ఈ సందర్భంగా సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని.. యువత సంయమనం పాటించాలన్నారు. వంతెన ప్రాంతంలో నది ఉధృతంగా ప్రవహిస్తోందని.. ఏరికోరి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని ఆయన సూచించారు. 24 గంటలు వంతెన వద్ద నిఘా ఉంచాలని నందిపేట పోలీసులను (Nandipet police) సీపీ ఆదేశించారు. ఆయన వెంట నందిపేట ఎస్సై శ్యాం రాజు, సిబ్బంది తదితరులున్నారు.

    More like this

    SriramSagar Project | శ్రీరాంసాగర్ వరదగేట్ల మూసివేత

    అక్షరటుడే, బాల్కొండ: SriramSagar Project | తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద తగ్గుముఖం పట్టడంతో గేట్లను ముసివేశారు....

    Harish Rao | మూడు పిల్ల‌ర్లు కుంగిపోతే ఇంత రాద్దాంతమా? క‌విత వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో హ‌రీశ్‌రావు సూటి ప్ర‌శ్న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Harish Rao | కాళేశ్వ‌రం ప్రాజెక్టులో మూడు పిల్ల‌ర్లు కుంగిపోతేనే కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీవ్ర...

    US President Trump | మాట మార్చేసిన ట్రంప్‌.. మూడు యుద్ధాల‌నే ఆపాన‌ని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: US President Trump | నోటికొచ్చింది వాగ‌డం, ఆ త‌ర్వాత మాట మార్చ‌డం అమెరికా...