ePaper
More
    HomeతెలంగాణKishan Reddy | త్వరలో జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక.. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

    Kishan Reddy | త్వరలో జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక.. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kishan Reddy | జూబ్లీహిల్స్ (Jubilee Hills)​ ఉప ఎన్నికపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్​, నవంబర్​లో ఎన్నిక జరిగే అవకాశం ఉందని అన్నారు.

    జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యేగా బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన మాగంటి గోపినాథ్ (Maganti Gopinath)​ జూన్​ 8న మరణించారు. దీంతో ఎన్నికల సంఘం ఆ స్థానానికి ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించనుంది. బీహార్​లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడే జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆ స్థానాన్ని గెలుచుకోవడం కోసం అన్ని పార్టీలు శ్రమిస్తున్నాయి.

    Kishan Reddy | బీఆర్​ఎస్​ తరహాలోనే..

    బీఆర్​ఎస్​ తరహాలోనే రేవంత్ పాలన సాగుతోందని కిషన్​రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ (BJP) బూత్‌ కమిటీల మీటింగ్​ శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. బీసీల ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కిషన్​రెడ్డి అన్నారు.

    Kishan Reddy | బీజేపీకి కంచుకోట

    హైదరాబాద్‌ (Hyderabad) బీజేపీకి కంచుకోట అని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు సాధించామని గుర్తుచేశారు. పార్లమెంట్‌ ఎన్నికలలో సైతం మంచి ఓట్లు సాధించినట్లు చెప్పారు. కాగా కాంగ్రెస్​ ఆరు గ్యారెంటీలు అమలు చేశాకే ప్రజలను ఓట్లు అడగాలని ఆయన డిమాండ్​ చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​కు గుణపాఠం చెప్పాలని రాంచందర్​రావు అన్నారు.

    Kishan Reddy | తీవ్రంగా శ్రమిస్తున్న పార్టీలు

    జూబ్లీహిల్స్​లో గెలుపు కోసం కాంగ్రెస్​ (Congress), బీజేపీ శ్రమిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్​ ఇన్​ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పలుమార్లు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అయితే ఈ స్థానం నుంచి టికెట్​ ఆశించిన అజారుద్దీన్​ను కాంగ్రెస్​ ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. దీంతో టికెట్​ ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్​ నేత ఫిరోజ్​ ఖాన్​ సైతం జూబ్లీహిల్స్​ టికెట్ ఆశిస్తున్నారు.

    బీజేపీ సైతం హైదరాబాద్​లో సీటు గెలువాలని చూస్తోంది. గతంలో నగరంలో పార్టీకి మంచి పట్టు ఉండేది. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహాల్​ స్థానాన్ని మాత్రమే కమలం పార్టీ గెలుచుకుంది. అక్కడి నుంచి గెలిచిన రాజాసింగ్​ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. దీంతో నగరంలో బీజేపీకి ఎమ్మెల్యేలు లేకుండా పోయారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్​ స్థానంలో గెలవాలని ఆ పార్టీ శ్రమిస్తోంది.

    Latest articles

    Shiva Worship | పాపాలను హరించే ప్రదోష పూజ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shiva Worship | హిందూ ధర్మం (Hindu Dharma) ప్రకారం శివారాధనకు ప్రదోష(Pradosha) సమయం...

    September 1 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 1 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 1,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...

    BRS MLAs boycott assembly | భారాస ఎమ్మెల్యేల అసెంబ్లీ బైకాట్​.. ఘోష్ కమిషన్ రిపోర్టు చించివేత

    అక్షరటుడే, హైదరాబాద్: BRS MLAs boycott assembly : పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ...

    Malaysia Telugu people | మలేసియాలో తెలుగు వారితో నటులు మురళీ మోహన్​, ప్రదీప్​ విందు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Malaysia Telugu people : మాజీ ఎంపీ, తెలుగు నటులు Telugu actors మాగంటి మురళీ...

    More like this

    Shiva Worship | పాపాలను హరించే ప్రదోష పూజ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shiva Worship | హిందూ ధర్మం (Hindu Dharma) ప్రకారం శివారాధనకు ప్రదోష(Pradosha) సమయం...

    September 1 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 1 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 1,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...

    BRS MLAs boycott assembly | భారాస ఎమ్మెల్యేల అసెంబ్లీ బైకాట్​.. ఘోష్ కమిషన్ రిపోర్టు చించివేత

    అక్షరటుడే, హైదరాబాద్: BRS MLAs boycott assembly : పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ...