అక్షరటుడే, లింగంపేట: Collector Kamareddy | అధిక వర్షాలతో కేకేవై రహదారిపై (KKY Road) తెగిపోయిన రోడ్ల పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఆదేశించారు.
లింగంపేట్ (Lingampet) మండలంలోని లింగంపేట్ కుర్దు వాగు వద్ద వంతెనను ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం ఆర్అండ్బీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డి ఎల్లారెడ్డి రూట్లో ప్రధాన రహదారిపై ఉన్న ఈ బ్రిడ్జి కూలిపోవడంతో ఈదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రవాణాను పునరుద్ధరించడానికి ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. త్వరగా పనులు పూర్తిచేయాలని ఆర్అండ్బీ ఈఈ మోహన్‌ను ఆదేశించారు. ఎల్లారెడ్డి డివిజన్లో దెబ్బతిన్న అన్ని రోడ్లు, వంతెనల పునరుద్ధరణ పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆర్డీవో పార్థ సింహారెడ్డిని ఆదేశించారు.
Collector Kamareddy | పోచారం ప్రాజెక్ట్ పరిశీలన
అక్షరటుడే, ఎల్లారెడ్డి: పోచారం ప్రాజెక్టు (Pocharm Project) మట్టికట్ట కోతకు గురైంది. ప్రాజెక్టు పొంగిపోర్లుతూ మంజీరలోకి వెళ్లే దారిలో భారీ వంతెన వద్ద రోడ్డు తెగిపోగా.. హైదరాబాద్-ఎల్లారెడ్డి రహదారి మూసుకుపోయింది. ఈ నేపథ్యంలో శనివారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పోచారం ప్రాజెక్టును సందర్శించి, జరుగుతున్న పనులను, తెగిపోయిన వంతెనను పరిశీలించారు.
ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేకుండా పనులు చేపట్టాలని సూచించారు. ఎల్లారెడ్డి మెదక్–హైదరాబాద్‌కు రాకపోకలకు ఎలాంటి అవంతరాలు జరగకుండా బ్రిడ్జి పనులను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్అండ్బీ ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.