ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిLingampet | ఓటరు జాబితాలో అభ్యంతరాల గడువు పెంచాలి

    Lingampet | ఓటరు జాబితాలో అభ్యంతరాల గడువు పెంచాలి

    Published on

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. తుది జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాలో (voter list) సవరణకు అభ్యంతరాల గడువు ఐదు రోజులకు పెంచాలని పలు పార్టీల నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం ఎంపీడీవో నరేశ్​కు (MPDO Naresh) వినతిపత్రం అందజేశారు.

    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల (political parties) ప్రతినిధులకు ఇప్పటివరకు ఓటరు జాబితాలు అందించలేదని పేర్కొన్నారు. తప్పుల సవరణకు శనివారం సమావేశం నిర్వహించి, అభ్యంతరాలు తెలపాలంటే ఎలా సాధ్యమన్నారు. అధికారులు ముందుగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటరు జాబితాలు అందించి, ఆపై అభ్యంతరాల కోసం గడువు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు.

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...