ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | సిద్ధాంతాల కోసం పనిచేసేవారు కమ్యూనిస్టులు: సీఎం రేవంత్​రెడ్డి

    CM Revanth Reddy | సిద్ధాంతాల కోసం పనిచేసేవారు కమ్యూనిస్టులు: సీఎం రేవంత్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం కంటే.. ప్రభుత్వాలను కూల్చడానికి పనికి వస్తారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. శనివారం నిర్వహించిన సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు.

    కమ్యూనిస్ట్​లు అధికారం కోసం కాకుండా సిద్ధాంతాల కోసం పనిచేస్తారన్నారు. అందు కోసమే అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉండడానికి ఆసక్తి చూపుతారని పేర్కొన్నారు. ప్రభుత్వాలను పడగొట్టడంలో వారి పాత్ర కీలమన్నారు. తెలంగాణలో అధికార మార్పు విషయంలో కూడా కమ్యూనిస్ట్​లు సహకరించారని చెప్పారు.

    CM Revanth Reddy | చరిత్రలో నిలిచిపోయేలా..

    సిద్ధాంతం కోసం జీవితాంతం పని చేసిన సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోయేలా నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రిమండలిలో చర్చిస్తామన్నారు. మహనీయుల పేర్లు రాష్ట్రంలో శాశ్వతంగా నిలవాలన్నారు. అందుకే తెలుగు విశ్వ విద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి (Suravaram Pratap Reddy) పేరు, మహిళా విద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టామని రేవంత్​రెడ్డి అన్నారు.

    CM Revanth Reddy | వన్నె తెచ్చారు

    ఒక ప్రాంతం నుంచి సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తులు ఉన్నప్పుడు చెప్పుకోవడానికి ఆ ప్రాంత వాసులకు గర్వంగా ఉంటుందని ఆయన అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణా రావు, జైపాల్ రెడ్డి, సురవరం సుధాకర్ రెడ్డి మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాకు వన్నె తెచ్చారని చెప్పారు. వారెప్పుడు సమాజంలో గౌరవం పొందుతూనే ఉంటారన్నారు. సుధాకర్ రెడ్డి గౌరవం శాశ్వతంగా గుర్తుంచుకునే విధంగా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

    Latest articles

    Shiva Worship | పాపాలను హరించే ప్రదోష పూజ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shiva Worship | హిందూ ధర్మం (Hindu Dharma) ప్రకారం శివారాధనకు ప్రదోష(Pradosha) సమయం...

    September 1 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 1 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 1,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...

    BRS MLAs boycott assembly | భారాస ఎమ్మెల్యేల అసెంబ్లీ బైకాట్​.. ఘోష్ కమిషన్ రిపోర్టు చించివేత

    అక్షరటుడే, హైదరాబాద్: BRS MLAs boycott assembly : పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ...

    Malaysia Telugu people | మలేసియాలో తెలుగు వారితో నటులు మురళీ మోహన్​, ప్రదీప్​ విందు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Malaysia Telugu people : మాజీ ఎంపీ, తెలుగు నటులు Telugu actors మాగంటి మురళీ...

    More like this