అక్షరటుడే, బోధన్: Flood areas | మండలంలోని హంగర్గ (Hangarga) గ్రామాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ సందర్శించారు. ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియన్మావి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తో (Bodhan Sub-Collector Vikas Mahato) కలిసి శనివారం ఆయన వరద ముంపునకు గురైన హంగర్గ గ్రామాన్ని సందర్శించారు.
తహశీల్దార్ విఠల్‌తో అడిగి వివరాలు తెలుసుకున్నారు. స్థానికులతో మాట్లాడి ధైర్యాన్నిచ్చారు. ముంపు గ్రామాల ప్రాంతాల ప్రజలు ఎలాంటి భయందోళనకు గురికావద్దని ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు అందిస్తుందని భరోసానిచ్చారు. ముంపునకు గురైన భాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించాలని తహశీల్దార్‌కు సూచించారు.
కందకుర్తిని పరిశీలించిన సబ్ కలెక్టర్
రెంజల్ (Renjal) మండలం కందకుర్తి (Kandakurthi) గ్రామాన్ని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి (Heavy Rains) నిజాంసాగర్ ప్రాజెక్టు (Nizamsagar Project) గేట్లు ఎత్తి మంజీరలోకి (manjeera) నీరు వదలడంతో వరద కందకుర్తిని చుట్టుముట్టింది. దీంతో గ్రామం నీటమునిగింది. అధికారులు నిన్నటి నుండి సహాయక చర్యలు చేపట్టారు. నేడు కూడా సహాయక చర్యలు కొనసాగుతుండడంతో బోధన్ సబ్ కలెక్టర్ పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడాలని తహశీల్దార్ శ్రావణిని ఆదేశించారు.