అక్షరటుడే, బాన్సువాడ: Birkoor mandal | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పేకాట జోరుగా కొనసాగుతోంది. పోలీసులు తరచూ దాడులు చేసి పలువురిని అరెస్టు చేస్తున్నా ఆగడం లేదు. పలు చోట్ల అడ్డాలు ఏర్పాటు చేసుకుని మరీ పేకాడుతున్నారు. ఎవరైనా పేకాడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నా ఖాతరు చేయడం లేదు.
తాజాగా.. పేకాడుతున్న ఆరుగురిని బీర్కూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీర్కూర్ మండల (Birkoor Mandal) కేంద్రంలోని కాలాబజార్ గల్లిలో ఓ ఇంట్లో పేకాడుతున్నారన్న సమాచారం రావడంతో శనివారం పోలీసులు దాడులు చేశారు. ఈ సమయంలో పేకాడుతు ఆరుగురు పట్టుబడ్డారని స్థానిక ఎసై రాజశేఖర్ (ASI Rajasekhar) తెలిపారు.
పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.3080 నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో ఎవరైనా పేకాడితే కఠిన చర్యలు (strict action) తప్పవని హెచ్చరించారు.