ePaper
More
    HomeతెలంగాణACB Raids | గురుకుల పాఠశాలలో ఏసీబీ దాడులు

    ACB Raids | గురుకుల పాఠశాలలో ఏసీబీ దాడులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ (ACB) తనిఖీలతో అవినీతి అధికారులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం దాడులు చేస్తుండడంతో ఎక్కడ తమ బండారం బయట పడుతుందోనని భయపడుతున్నారు.

    ఖమ్మం (Khammam) జిల్లా కొనిజెర్ల మండలం అమ్మపాలెం మైనారిటీ బాలుర రెసిడెన్షియల్​ పాఠశాలలో శనివారం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. లీగల్​ మెట్రాలజీ ఇన్​స్పెక్టర్​, శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఆడిటర్ సాయంతో ఏసీబీ దాడులు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఆహారం నాణ్యత, పారిశుధ్యం, విద్యార్థుల వివరాలు, రికార్డులు పరిశీలించారు.

    ACB Raids | ప్రభుత్వానికి నివేదిక

    తనిఖీల సమయంలో ఏసీబీ అధికారులు పలు అవకతవకలను గుర్తించారు. పాఠశాల, కళాశాలలో అపరిశుభ్రమైన మరుగుదొడ్లు, గదులు, ప్రాంగణాల నిర్వహణ సరిగా లేకపోవడాన్ని గమనించారు. రిజిస్టర్ల నిర్వహణ కూడా సరిగ్గా లేనట్లు గుర్తించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఏసీబీ తెలిపింది.

    ACB Raids | వరుస దాడులు

    ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. అవినీతి అధికారులపై కేసులు నమోదు చేస్తుండడంతో పాటు పలు కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు చేపడుతున్నారు. అలాగే సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలో సైతం సోదాలు చేపడుతుండడం గమనార్హం. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట్​లో ఎస్సీ బాలికల హాస్టల్ (Girls Hostel)​, నారాయణపేట జిల్లా కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాలల్లో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.

    ACB Raids | లంచం అడిగితే ఫోన్​ చేయండి

    ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...