ePaper
More
    HomeజాతీయంTik Tok | టిక్​ టాక్​ మళ్లీ ఎంట్రీ ఇవ్వనుందా.. భారత్​లో ఉద్యోగులను నియమించుకుంటున్న సంస్థ

    Tik Tok | టిక్​ టాక్​ మళ్లీ ఎంట్రీ ఇవ్వనుందా.. భారత్​లో ఉద్యోగులను నియమించుకుంటున్న సంస్థ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tik Tok | టిక్​ టాక్​ మళ్లీ భారత్​లోకి రానుందా.. ఇటీవల టిక్ ​టాక్​ రీ ఎంట్రీపై వార్తలు రాగా.. కేంద్ర ప్రభుత్వం (Central Government) ఖండించింది. దానిపై బ్యాన్​ కొనసాగుతోందని స్పష్టం చేసింది. టిక్​టాక్​ తాజాగా భారత్​లో పలు ఉద్యోగాల భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

    ఈ మేరకు లింక్డ్​ఇన్​లో పోస్ట్​ చేసింది. హర్యానాలోని గుర్గావ్​లో పని చేయడానికి కంటెంట్​ మోడరేటర్​, వెల్​బియింగ్​ పార్టర్​షిప్​ అండ్​ ఆపరేషన్స్​ లీడ్​ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో మళ్లీ టిక్​టాక్ (Tik Tok)​ రానుందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్రం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

    Tik Tok | భారత్​ పెద్ద మార్కెట్​

    టిక్​ టాక్​ను భారత్​ 2020లో బ్యాన్​ చేసింది. అంతకుముందు ఆ సంస్థకు భారీ పెద్ద మార్కెట్​గా ఉండేది. భారీగా యూజర్లు సదరు సంస్థకు ఉండేవారు. చాలా మంది టిక్​టాక్​ ద్వారా ఫేమస్​ అయ్యారు. ఎంతో మంది దానికి బానిసలుగా మారారు. టిక్​టాక్​ దెబ్బకు ఫేస్​బుక్​ రీల్స్​ (Facebook Reels), యూట్యూబ్​ షార్ట్స్ (YouTube Shorts)​ తీసుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో భారత్​–చైనా మధ్య గాల్వన్​ లోయలో ఘర్షణ తలెత్తడంతో కేంద్రం 2020 జూన్​లో టిక్​టాక్​ సహా 59 చైనా యాప్​లను నిషేధించింది.

    Tik Tok | జోరుగా చర్చ

    టిక్​ టాక్​ భారత్​లో నియామకాలు చేపట్టడంతో మళ్లీ రాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల భారత్​పై అమెరికా 50 సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీంతో భారత్​–రష్యా–చైనా కలిసి ముందుకు సాగనున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ప్రధాని మోదీ శనివారం చైనా పర్యటనకు వెళ్లారు. త్వరలో రష్యా అధ్యక్షుడు పుతిన్​ భారత్​కు రానున్నారు. మోదీ చైనా పర్యటన సందర్భంగా పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా చైనా యాప్​లపై నిషేధం ఎత్తివేస్తారని ప్రచారం సాగుతోంది.

    Tik Tok | పూర్వ వైభవం సాధ్యమేనా..

    భారత్​లో టిక్​టాక్​ నిషేధించకముందు దాదాపు 200 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. అనంతరం ఇన్​స్టాగ్రామ్​ అందుబాటులోకి రావడంతో చాలా మంది దానికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో దేశంలో టిక్​టాక్​ రీ ఎంట్రీ ఇచ్చిన పూర్వస్థాయిలో వైభవం దక్కే అవకాశం లేదు.

    Latest articles

    Shiva Worship | పాపాలను హరించే ప్రదోష పూజ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shiva Worship | హిందూ ధర్మం (Hindu Dharma) ప్రకారం శివారాధనకు ప్రదోష(Pradosha) సమయం...

    September 1 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 1 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 1,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...

    BRS MLAs boycott assembly | భారాస ఎమ్మెల్యేల అసెంబ్లీ బైకాట్​.. ఘోష్ కమిషన్ రిపోర్టు చించివేత

    అక్షరటుడే, హైదరాబాద్: BRS MLAs boycott assembly : పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ...

    Malaysia Telugu people | మలేసియాలో తెలుగు వారితో నటులు మురళీ మోహన్​, ప్రదీప్​ విందు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Malaysia Telugu people : మాజీ ఎంపీ, తెలుగు నటులు Telugu actors మాగంటి మురళీ...

    More like this

    Shiva Worship | పాపాలను హరించే ప్రదోష పూజ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shiva Worship | హిందూ ధర్మం (Hindu Dharma) ప్రకారం శివారాధనకు ప్రదోష(Pradosha) సమయం...

    September 1 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 1 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 1,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...

    BRS MLAs boycott assembly | భారాస ఎమ్మెల్యేల అసెంబ్లీ బైకాట్​.. ఘోష్ కమిషన్ రిపోర్టు చించివేత

    అక్షరటుడే, హైదరాబాద్: BRS MLAs boycott assembly : పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ...