అక్షరటుడే, ఇందూరు: Employees JAC | ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ (TNGO’s Nizamabad) జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ (Nashetti Suman Kumar) తెలిపారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి (Collector Vinay Krishna Reddy) శనివారం ఉద్యమ కార్యాచరణపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర కమిటీ విడుదల చేసిన కార్యాచరణకు అనుగుణంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి జిల్లాలోనూ ఉద్యమం కొనసాగుతుందన్నారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు నివేదించినట్లు పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఎంప్లాయీస్ జేఏసీ కో–ఛైర్మన్లు రమణ్రెడ్డి, ధర్మేందర్, వైస్ ఛైర్మన్లు శేఖర్, ప్రశాంత్, రమణ చారి, జమీల్ ఉల్లా, ఫైనాన్స్ సెక్రెటరీ జాకీర్ హుస్సేన్ కార్యవర్గ సభ్యులు నారాయణరెడ్డి, శ్రీనివాస్, మాణిక్యం, మంగమ్మ, శ్రీవేణి, గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.