ePaper
More
    HomeసినిమాChiranjeevi | అత్త‌మ్మ పాడె మోసిన చిరంజీవి.. తీవ్ర విషాదంలో మెగా, అల్లు ఫ్యామిలీస్

    Chiranjeevi | అత్త‌మ్మ పాడె మోసిన చిరంజీవి.. తీవ్ర విషాదంలో మెగా, అల్లు ఫ్యామిలీస్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chiranjeevi | అల్లు ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రముఖ సినీ నిర్మాత తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.

    గత కొన్ని నెలలుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈ రోజు మరణించడంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఈ క్ర‌మంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు అల్లు అర‌వింద్ (Allu Aravind) ఇంటికి చేరుకొని నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవికి (Megastar Chiranjeevi) ఈ విష‌యం తెలిసిన వెంట‌నే అల్లు అర‌వింద్ ఇంటికి వెళ్లి అక్క‌డే ఉన్నారు. ఇక అత్త‌మ్మ పాడెను చిరు మోశారు. ఆ ప‌క్క‌నే అల్లు అర్జున్, ఆయ‌న త‌న‌యుడు అయాన్ కూడా ఉన్నారు. ఈ విజువల్స్ వైరల్​గా మారాయి. అభిమానులు ఇది చూసి చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు.

    అల్లు అర్జున్ నానమ్మ, అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ (94) వ‌యోభారం కార‌ణంగా కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అయితే త‌న అమ్మ‌మ్మ మృతి చెందిన విష‌యం తెలుసుకున్న న‌టుడు రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) మైసూరులో తన సినిమా షూటింగ్‌ను మ‌ధ్య‌లో ఆపేసి హుటాహుటిన హైదరాబాద్ వ‌చ్చారు. అనంత‌రం అమ్మ‌మ్మ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ క్ర‌మంలోనే మేన‌మామ అర‌వింద్‌తో పాటు అల్లు అర్జున్‌ని (Allu Arjun) రామ్ చ‌ర‌ణ్ ఓదార్చారు. పెద్ది సినిమా షూటింగ్‌లో మ‌ధ్య‌లో ఆపేసి వచ్చిన రామ్ చ‌ర‌ణ్ ఆ త‌ర్వాత మ‌ళ్లీ మైసూర్ వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం.

    మరోవైపు కనకరత్నం భౌతికకాయానికి పవన్‌ కల్యాణ్‌ సతీమణి నివాళులర్పించారు. ఆ త‌ర్వాత అన్నాలెజినోవా అల్లు అరవింద్‌, అల్లు అర్జున్, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మ‌రోవైపు అల్లు కనకరత్నమ్మ భౌతికకాయానికి సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ నివాళులర్పించారు.

    Latest articles

    Shiva Worship | పాపాలను హరించే ప్రదోష పూజ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shiva Worship | హిందూ ధర్మం (Hindu Dharma) ప్రకారం శివారాధనకు ప్రదోష(Pradosha) సమయం...

    September 1 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 1 Panchangam : తేదీ (DATE) – సెప్టెంబరు 1,​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri...

    BRS MLAs boycott assembly | భారాస ఎమ్మెల్యేల అసెంబ్లీ బైకాట్​.. ఘోష్ కమిషన్ రిపోర్టు చించివేత

    అక్షరటుడే, హైదరాబాద్: BRS MLAs boycott assembly : పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ...

    Malaysia Telugu people | మలేసియాలో తెలుగు వారితో నటులు మురళీ మోహన్​, ప్రదీప్​ విందు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Malaysia Telugu people : మాజీ ఎంపీ, తెలుగు నటులు Telugu actors మాగంటి మురళీ...

    More like this