అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | భారీవర్షాలతో అతలాకుతలమైన ఎల్లారెడ్డి, నిజాంసాగర్ (Nizamsagar) మండలాల్లో రైతులకు తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్ (Ex Mla jajala surender), హన్మంత్ షిండే (Ex Mla Hanmanth Shinde) డిమాండ్ చేశారు.
ఈ మేరకు శనివారం ఎల్లారెడ్డి మండలంలో వరదకు కొట్టుకుపోయిన రోడ్లు, పంటపొలాలను పరిశీలించారు. రైతులకు అండగా మేమున్నామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
కొట్టుకుపోయిన రోడ్లను త్వరగా బాగు చేయించి రవాణా వ్యవస్థను బాగు చేయాలని వారు పేర్కొన్నారు. తెగిపోయిన చెరువులు, కుంటలను వెంటనే మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తామని వారు పేర్కొన్నారు. వారితో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.