అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Cabinet meeting | తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) అధ్యక్షతన మీటింగ్ జరుగుతోంది. ఇందులో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ నిర్ణయించింది. కాగా.. గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Telangana Cabinet meeting | కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకేనా..
బీసీ రిజర్వేషన్ల బిల్లుకు (BC reservation bill) రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి కేంద్రానికి పంపింది. కాగా.. ఈ బిల్లును కేంద్రం ఇప్పటివరకు ఆమోదించలేదు. బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు కేటాయించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ బిల్లుకు ఆమోదం లభించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను రూపొందించి గవర్నర్‌కు పంపినా ఇప్పటి వరకు ఆయన ఆమోదించలేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం సందిగ్ధంలో పడింది. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందకపోతే పార్టీ తరఫున రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది.
కాగా.. నేడు జరుగుతున్న రాష్ట్ర కేబినెట్లో భేటీలో (state cabinet meeting) రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.