అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan | ఎల్లారెడ్డి నియోజకవర్గానికి స్పెషల్ ప్యాకేజీ నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా శనివారం సీఎంతో ఎమ్మెల్యే భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని (Yellareddy constituency) భారీ వర్షాలు, వరదలు కుదిపేశాయని వివరించారు. వందల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని.. రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారన్నారు. రోడ్లు, వంతెనలు, చెరువులు ధ్వంసమయ్యాయని.. వాటి పునర్నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు విడుదల చేయాలని సీఎంను విజ్ఞప్తి చేశారు.
Mla Madan Mohan | వరదకు తట్టుకొని నిలబడ్డ పోచారం ప్రాజెక్టు..
103 ఏళ్ల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్ట్ (Pocharam Project) భారీ వరదను సైతం తట్టుకొని నిలబడిందని.. అయితే అక్కడక్కగా గుంతలు పడ్డ సందర్భంగా మరమ్మతుల నిమిత్తం నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే కోరారు.
నియోజకవర్గంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ధ్వంసమైన గృహాలకు ‘ఇందిరమ్మ హౌసింగ్ స్కీం కింద నూతన గృహాలు మంజూరు చేయాలని విన్నవించారు.
Mla Madan Mohan | సీఎం సానుకూల స్పందన
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలాంగా స్పందించారు. విపత్తుపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్పందిస్తుందని, అవసరమైన నిధులను త్వరితగతిన విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
వరదల సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సహాయ బృందాలను సమన్వయం చేసిన ఎమ్మెల్యే మదన్మోహన్ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు. వరదల్లో ఇరుక్కున్న ప్రజలను సురక్షితంగా బయటకు రప్పించడంలో ఆయన పాత్ర కీలకమైందని సీఎం పేర్కొన్నారు.