అక్షరటుడే, వెబ్‌డెస్క్: Donald Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ చనిపోయారంటూ ట్విట్టర్‌లో ‘TRUMP IS DEAD’ అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
ఆయన చనిపోయిన తర్వాత అధికార పార్టీ ఈ విషయాన్నీ దాచి పెట్టిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ చనిపోవాలని అనేక మంది అమెరికన్ నెటిజన్లు (American Netizens) సోషల్ మీడియాలో కోరుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరణానానికి సంబంధించిన అనేక హాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. సుంకాలు, రాజకీయ ఎత్తుగడలు లేదా ట్రంప్ ట్రేడ్‌మార్క్ వ్యాఖ్యల విషయంలో కొన్ని రోజులుగా ‘X’లో ట్రెండింగ్‌లోకి రాని అధ్యక్షుడు.. “ట్రంప్ చనిపోయాడు” అనే హ్యాష్‌ట్యాగ్ కారణంగా ట్రెండింగ్‌లోకి వచ్చారు. ట్రంప్ ఆరోగ్య సమస్యలకు (Trump Health Problems) తోడు ది సింప్సన్స్ సృష్టికర్త మాట్ గ్రోనింగ్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ చనిపోయాడన్న హ్యాష్‌ట్యాగ్ వైరల్ అవుతోంది.
Donald Trump | ఈ ట్రెండ్ ఎలా ప్రారంభమైందంటే..
జేడీ వాన్స్ (J.D. Vance) రెండ్రోజుల క్రితం ఇచ్చిన యూఎస్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. భయంకరమైన విషాదం సంభవిస్తే తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దీని తర్వాతే ట్రంప్ (Donald Trump) చనిపోయాడన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. “భయంకరమైన విషాదం” సంభవించినట్లయితే ఆయన బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగినప్పుడు, 79 ఏళ్ల ట్రంప్ “ఫిట్‌గా, ఉత్సాహంగా” ఉన్నారని, కానీ ఊహించని సంఘటనలను తోసిపుచ్చలేమని వాన్స్ నొక్కి చెప్పారు. ట్రంప్ తన పదవీకాలాన్ని పూర్తి చేస్తారని తాను విశ్వసిస్తున్నానన్నారు. ట్రంప్ ఆరోగ్యం గురించి అతని వ్యాఖ్యలు, ట్రంప్ ఆరోగ్యం గురించి తప్పుడు ప్రశ్నలతో కలిపి, ఈ ధోరణికి ఆజ్యం పోసినట్లు కనిపిస్తోంది.
Donald Trump | ట్రంప్ ఆరోగ్యంపై వైరల్‌గా మారిన పోస్టులు
వాషింగ్టన్‌కు చెందిన అవుట్‌లెట్ రోల్ కాల్ ప్రకారం ఆగస్టు 30, 31 తేదీలలో ట్రంప్ అధికారిక షెడ్యూల్ బయటకు రాలేదు. మరోవైపు, గత 24 గంటల్లో ట్రంప్ పోస్ట్‌లు ‘X’లో కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆయన చనిపోయాడన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ట్రంప్ ఆరోగ్యం గురించి కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో, ముఖ్యంగా అతని చేతిపై పునరావృతమయ్యే గాయాల నేపథ్యంలో ఇది మరింత జోరందుకుంది. “డోనాల్డ్ ట్రంప్ 24 గంటలకు పైగా కనిపించలేదు. ఇంతకీ అసలు ఏం జరుగుతోంది?” అని ఓ నెటిజన్ పోస్టు చేశారు. దీంతో అప్పటి నుంచి హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
Donald Trump | అనారోగ్య సమస్యలు..
ట్రంప్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈవిషయాన్ని వైట్ హౌస్ (White House) కూడా ధ్రువీకరించింది. ట్రంప్ దీర్ఘకాలిక సిరల లోపంతో బాధపడుతున్నారని, ఇది కాళ్ల వాపునకు కారణమయ్యే సిరల వ్యాధి అని వైట్ హౌస్ జూలైలో ధ్రువీకరించింది. ఆ తర్వాత ట్రంప్ చేతిలో కనిపించే గాయాల గురించి కూడా ఊహాగానాలు పెరిగాయి, కొన్నిసార్లు అతను మేకప్‌తో కవర్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ అది బయట పడింది.