ePaper
More
    HomeFeaturesPlatelets | ప్లేట్‌లెట్స్ పడిపోయాయా.. ఈ ఫుడ్ తీసుకుంటే అంతా సెట్

    Platelets | ప్లేట్‌లెట్స్ పడిపోయాయా.. ఈ ఫుడ్ తీసుకుంటే అంతా సెట్

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Platelets | శరీరంలో ప్లేట్‌లెట్లు చాలా ముఖ్యమైనవి. ఇవి రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు రక్తస్రావం(Bleeding) ఎక్కువ అవుతుంది.

    ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా (Dengue, malaria) వంటి వ్యాధులు వచ్చినప్పుడు ప్లేట్‌లెట్స్ సంఖ్య (platelet count) వేగంగా పడిపోతుంది. ఈ పరిస్థితిలో వాటిని తిరిగి పెంచడానికి కొన్ని ఆహారాలు చాలా ఉపయోగపడతాయి. వీటిని మన దైనందిన జీవితంలో చేర్చుకోవడం వల్ల ప్లేట్‌లెట్లతో పాటు మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.

    బొప్పాయి : ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడంలో బొప్పాయి ఆకులు (Papaya leaves) చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ రోగులకు (dengue patients) ఇది ఒక సంప్రదాయ ఔషధంలా పని చేస్తుంది. బొప్పాయి ఆకులను రసం చేసి తాగడం వల్ల ప్లేట్‌లెట్లు వేగంగా పెరుగుతాయి. పండిన బొప్పాయి పండు తినడం కూడా మంచిది.

    కివి పండు: కివిలో విటమిన్ సి (vitamin C), ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, ప్లేట్‌లెట్ కణాల ఉత్పత్తికి (For the production of platelet cells) సహాయపడుతుంది. ఒక కివి పండును రోజూ తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

    బీట్‌రూట్: ఇందులో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికం. బీట్‌రూట్‌ను జ్యూస్‌గా కానీ, కూరగా కానీ తీసుకోవడం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. ఇది ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడంలో ఎంతో సహాయపడుతుంది.

    దానిమ్మ: దానిమ్మ గింజల్లో ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్లేట్‌లెట్ల పెరుగుదలకు తోడ్పడతాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది(Purifies the blood). రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

    గుమ్మడికాయ: విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహారాలలో గుమ్మడికాయ ఒకటి. విటమిన్ ఏ (Vitamin A) ప్లేట్‌లెట్ల ఉత్పత్తికి అవసరం. గుమ్మడికాయ కూర లేదా సూప్ గా తీసుకోవడం ప్లేట్‌లెట్ సంఖ్య పెరగడానికి సహాయపడుతుంది.

    వీటితో తీసుకోవడంతో పాటు, పుష్కలంగా నీరు తాగడం, పండ్లు, కూరగాయలు (fruits and vegetables) ఎక్కువగా తీసుకోవడం ముఖ్యం. ఏదేమైనా, ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా పడిపోయినప్పుడు వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం తప్పనిసరి.

    More like this

    Nizamabad KFC | నిజామాబాద్​ కేఎఫ్​సీలో కుల్లిపోయిన చికెన్​.. సిబ్బందితో వినియోగదారుడి వాగ్వాదం!

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC : ఇటీవల ఫుడ్​ సెంటర్లు బాగా పాపులర్​ అయ్యాయి. జనాలు ఎగబడి తింటున్నారు....

    Medicover Hospital | మెడికవర్​ ఆస్పత్రిలో చిన్నారికి అరుదైన చికిత్స

    అక్షరటుడే, ఇందూరు: Medicover Hospital | నగరంలోని మెడికవర్​ ఆస్పత్రిలో మూడేళ్ల చిన్నారికి వైద్యులు అరుదైన చికిత్స నిర్వహించారు....

    Mancherial | యువతి ఆత్మహత్య.. విషయం తెలిసి బావిలో దూకిన ప్రియుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mancherial మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య...