ePaper
More
    Homeభక్తిArunachalam | భక్తులకు గుడ్​న్యూస్​.. అరుణాచలం క్షేత్రానికి స్పెషల్​ టూర్​ ప్యాకేజీ

    Arunachalam | భక్తులకు గుడ్​న్యూస్​.. అరుణాచలం క్షేత్రానికి స్పెషల్​ టూర్​ ప్యాకేజీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Arunachalam | అరుణాచల క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అక్కడ గిరిప్రదక్షిణ(Giri Pradakshina) చేసి మొక్కులు చెల్లించుకుంటారు.

    తెలంగాణ(Telangana) నుంచి సైతం భారీ సంఖ్యలో భక్తులు అరుణాచలం వెళ్తారు. ముఖ్యంగా పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షిణ కోసం వేలాదిగా భక్తులు వెళ్తుంటారు. వీరికోసం ఇప్పటికే ఆర్టీసీ పలు స్పెషల్​ టూర్​ ప్యాకేజీలు తీసుకొచ్చింది. అన్ని డిపోల నుంచి అరుణాచలానికి స్పెషల్​ బస్సులు నడుపుతోంది. తాజాగా తెలంగాణ పర్యాటక శాఖ(Telangana Tourism Department) సైతం అరుణాచలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక టూర్​ ప్యాకేజీ ప్రవేశపెట్టింది.

    Arunachalam | నాలుగు రోజులు

    హైదరాబాద్​–అరుణాచలం పేరుతో టూరిజం డిపార్ట్​మెంట్​ప్యాకేజీ(Tourism Department Package) అందుబాటులోకి తీసుకువచ్చింది. సెప్టెంబర్​కు సంబంధించిన టూర్ తేదీలను ప్రకటించింది. ఈ టూర్​ మొత్తం నాలుగు రోజులు సాగుతోంది. రోడ్డు మార్గం ద్వారా ఈ యాత్ర సాగనుంది. ఇందులో భాగంగా కాణిపాకం, వేలూర్, శ్రీపురం గోల్డెన్ టెంపుల్(Sripuram Golden Temple) దర్శనం కూడా చేయిస్తారు.

    Arunachalam | బుకింగ్స్​ ప్రారంభం

    సెప్టెంబర్​ నెలలో ఈ టూర్​ ప్యాకేజీ నాలుగు సార్లు అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో హైదరాబాద్​ నుంచి అరుణాచలం(Hyderabad to Arunachalam) యాత్ర ఉంటుంది. ఆయా తేదీల్లో వెళ్లాలనుకునే వారు ముందుగానే టికెట్లు బుక్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే బుకింగ్స్​ ప్రారంభం అయ్యాయి. తెలంగాణ టూరిజం వెబ్​సైట్​ https://tourism.telangana.gov.in/tours లో టికెట్లు బుక్​ చేసుకోవచ్చు. ఈ టూర్​లో భాగంగా పెద్దలకు రూ.8 వేలు, పిల్లలు రూ.6,400గా టికెట్​ ధర నిర్ణయించారు.

    Latest articles

    Gold Prices on August 31 | మ‌ళ్లీ భ‌గ్గుమంటున్న బంగారం.. తులంపై ఎంత పెరిగిందంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices on August 31: దేశంలో బంగారం, వెండి ధరలు భ‌గ్గుమంటున్నాయి. ప్రతిరోజూ స్వల్ప...

    Tea-snacks | టీ తో కలిపి ఈ స్నాక్స్ తింటే.. అంతే సంగతులు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tea-snacks | టీ మన జీవితంలో ఒక భాగమైపోయింది. చాలామంది ఉదయం, సాయంత్రం టీ తాగే...

    August 31 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 31 Panchangam : తేదీ (DATE) – 31 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Kamareddy Flood troubles | నాలాల ఆక్రమణలతోనే వరద కష్టాలు.. మీడియాతో కామారెడ్డి వాసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Flood troubles | కుండపోత వర్షం కామారెడ్డి ప్రజలకు (Kamareddy People) కన్నీళ్లు మిగిల్చింది....

    More like this