అక్షరటుడే, ఇందూరు: Jenda Balaji Temple | గోవింద నామస్మరణతో నగరంలోని జెండా బాలాజీ ఆలయం మార్మోగుతోంది. జెండాను దర్శించుకోవడానికి శనివారం భక్తులు బారులు తీరారు.
ఆలయంలో వంశపారపర్య అర్చకులు అజయ్ సంగ్వాయి, సంజయ్ సంగ్వాయి, విజయ్ సంగ్వాయి నేతృత్వంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 15 రోజుల పాటు కొనసాగే జాతర పౌర్ణమి రోజు ముగియనుంది. ఈ ఏడాది చంద్రగ్రహణం (Chandra Grahanam) రావడంతో ఉదయం 8 గంటలకే జెండాను ఆలయం నుంచి పులాంగ్కు (Pulang) తరలించనున్నారు.
అయితే పులాంగ్ వద్ద చంద్రగ్రహణం రోజు ఎటువంటి పూజా కార్యక్రమాలు ఉండవని అర్చకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మరుసటి రోజు నుంచి ఎప్పటిలాగే కొనసాగుతాయని పేర్కొన్నారు.
జెండా జాతరలో నుడా (NUDA) ఛైర్మన్ కేశవేణు (Kesh Venu) కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గోల్ హనుమాన్ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయంలో స్వామివారికి పూజలు చేస్తున్న వేదపండితుడు
ఆలయంలో పూజలు చేస్తున్న నుడా ఛైర్మన్ కేశవేణు దంపతులు
ఆలయానికి పోటెత్తిన భక్తులు