ePaper
More
    Homeజిల్లాలుజోగులాంబ గద్వాల్Urea Problems | యూరియా కోసం వెళ్లిన రైతును కొట్టిన ఎస్సై.. ఆగ్రహం వ్యక్తం చేసిన...

    Urea Problems | యూరియా కోసం వెళ్లిన రైతును కొట్టిన ఎస్సై.. ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్​రావు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Urea Problems | యూరియా కొరతతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం సొసైటీలు, ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు.

    యూరియా ఏదని అధికారులను నిలదీస్తున్నారు. ఈ క్రమంలో యూరియా కోసం ప్రశ్నించిన ఓ రైతును ఎస్సై(SI) చెంపపై కొట్టాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో చోటు చేసుకుంది. శనివారం ఉదయం రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన ఎస్సైని రైతులు(Farmers) ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన ఓ రైతు చెంపపై కొట్టారు. ఎస్సై తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

     Urea Problems | యూరియా కోసం తిప్పలు

    ప్రస్తుతం వరి పొలాలు పొట్ట దశలో ఉన్నాయి. ఇప్పుడు యూరియా వేయకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతోంది. దీంతో రైతులు యూరియా బస్తాల కోసం తిప్పలు పడుతున్నారు. నిత్యం తెల్లవారుజామున నుంచే సొసైటీల వద్ద బారులు తీరుతున్నారు. ఇంటిల్లాపాది పనులు మానుకొని యూరియా కోసం లైన్​లలో నిల్చుంటున్నారు.

     Urea Problems | కమిషనర్‌ను కలిసిన బీఆర్​ఎస్​ నేతలు

    బీఆర్​ఎస్​ నేతలు శనివారం అగ్రికల్చర్​ కమిషనర్​(Agriculture Commissioner)ను కలిశారు. ఈ సందర్భంగా హరీశ్​రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూరియా కోసం వెళ్తే రైతులను కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఎస్సై రైతును చెంపపై కొట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో రాని యూరియా కొరత(Urea Shortage) ఇప్పుడు ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు.

     Urea Problems | ప్రణాళిక లేకపోవడంతో..

    సరైన ప్రాణాళిక లేకపోవడంతో యూరియా కొరత వచ్చిందని హరీశ్​రావు(Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షంలో తడుస్తూ, అర్ధరాత్రులు ఎరువుల కోసం మహిళా రైతులు రోడ్ల మీద నిలబడి ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఇబ్బందులు పడకుండా సరిపడా యూరియా ఇవ్వాలని అగ్రికల్చర్ కమిషనర్‌ను కోరారు. అనంతరం కమిషనర్​ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. కాగా వారిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

     

    View this post on Instagram

     

    A post shared by Akshara Today (@aksharatoday)

    More like this

    Donald Trump | హ‌మాస్‌కు ట్రంప్ అల్టీమేటమ్‌.. బందీల‌ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌(Hamas)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...

    NH 44 | నేషనల్​ హైవేపై ట్రక్కులో చెలరేగిన మంటలు

    అక్షరటుడే, ఇందల్వాయి : NH 44 | జాతీయ రహదారి(National Highway)పై ట్రక్కులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన...

    IPO | ఈ వారంలోనూ ఐపీవోల జాతర.. పబ్లిక్‌ ఇష్యూకు పది కంపెనీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | దేశీయ స్టాక్ మార్కెట్‌లో పబ్లిక్ ఇష్యూల(Public issues) జాతర కొనసాగుతోంది. ఈ...