అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Samsung Galaxy A17 5G | ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ అయిన శాంసంగ్ ‘ఏ’ సిరీస్‌లో మరో మోడల్‌ను లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ A17 పేరుతో దీనిని తీసుకువచ్చింది.
ఆరేళ్ల పాటు ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ ఫీచర్ల గురించి తెలుసుకుందామా..
డిస్‌ప్లే : 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ యూ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్.. 90Hz రిఫ్రెష్ రేట్‌తోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక‌్షన్‌ను కలిగి ఉంది.
సాఫ్ట్‌వేర్ : గెలాక్సీ A17 5G 5ఎన్ఎమ్ టెక్నాలజీపై ఆధారపడిన Exynos 1330 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 ఆధారంగా పనిచేస్తుంది. ఆరేళ్ల పాటు ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వనుంది.
కెమెరా : ఫోన్ వెనకభాగంలో 50 MP ప్రధాన కెమెరా, 5 MP అల్ట్రావైడ్, 2 MP మాక్రో కెమెరా ఇచ్చారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్‌తో తీసుకువచ్చిన 50 MP ప్రైమరీ కెమెరా ఫొటో, వీడియో క్వాలిటీని మరింత మెరుగుపరుస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందువైపు 13 ఎంపీ సెన్సార్ ఉంది.
బ్యాటరీ : 5,000 mAh బ్యాటరీ అమర్చారు. ఇది 25w ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
వేరియంట్స్ : బ్లాక్, గ్రే కలర్స్‌లో మూడు వేరియంట్లలో లభిస్తుంది.
6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.18,999.
8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.20,999.
8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.23,499.
కార్డ్ ఆఫర్స్ : కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌నుంచి కొనుగోలు చేసినట్లయితే ఎస్‌బీఐ, హెడీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై వెయ్యి రూపాయల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్‌లో ఐసీఐసీఐ అమెజాన్‌పే క్రెడిట్‌కార్డుతో, ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డుతో ఐదు శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్‌కార్డులతో కొనుగోలు చేసేవారికి రూ. 1000 వరకు డిస్కౌంట్ లభించనుంది.