ePaper
More
    HomeసినిమాPawan Kalyan | త‌ప్ప‌ని ప‌రిస్థితుల‌లో సినిమాలు చేయాల్సి వ‌స్తుంది.. అది త‌ప్పేమి కాదే: ప‌వ‌న్...

    Pawan Kalyan | త‌ప్ప‌ని ప‌రిస్థితుల‌లో సినిమాలు చేయాల్సి వ‌స్తుంది.. అది త‌ప్పేమి కాదే: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pawan Kalyan | జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కుల, కుటుంబపక్షపాత పార్టీగా మారదని, ప్రజల ఆశలను నమ్ముకుని ముందుకు సాగే బలమైన ప్రాంతీయ పార్టీగా కొనసాగుతుందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

    శుక్రవారం జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌(Nadendla Manohar)తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి వచ్చిన జన సైనికులు, వీర మహిళలు, వివిధ వృత్తుల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “జనసేన పార్టీ(Janasena Party) భావజాలాన్ని నమ్మే వారికి ఇది వేదిక. ఒక్కరిని నియమించి బాధ్యతల్ని అప్పగించడం కాదీ పార్టీ లక్ష్యం. కష్టాలను ఎదుర్కొంటూ, ప్రజల కోసం నిజాయితీగా పోరాడే నాయకత్వాన్ని తయారు చేయడమే మా ధ్యేయం” అని అన్నారు.

    Pawan Kalyan | త‌ప్ప‌క సినిమాలు..

    పవన్ కళ్యాణ్ వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ, “వారి పాలనలో అక్రమ మైనింగ్, ప్రకృతి విధ్వంసం, అవినీతి ప్రధాన లక్షణాలైతే… జనసేన మాత్రం ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్న పార్టీ” అన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై చేసిన పోరాటాన్ని ఉదహరిస్తూ, “ఐదుగురు యువకుల చైతన్యం వల్లే ఈ సమస్యపై పోరాటం ప్రారంభమైంది. అలాంటి సమూహాలే సమాజంలో మార్పుకు మార్గదర్శకాలు అవుతాయి” అని పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ, “సినిమాల ద్వారా వచ్చిన అభిమాన బలాన్ని రాజకీయంగా మారుస్తున్నాను. ఓ భావజాలాన్ని నమ్మిన అభిమానులు ఇప్పుడు రాజకీయ నాయకులుగా మారి వేల మందిని ప్రభావితం చేయగల సామర్థ్యం సంపాదించారు” అన్నారు. అయితే ఒక్కోసారి అదే అభిమానం అడ్డంకిగా మారిందన్న విషయం కూడా నిజమే అని ఆయన ఆత్మవిశ్లేషణ చేశారు.

    సినిమాలు మానేయాలని ఎన్నిసార్లు అనుకున్నా… పార్టీ కోసం, సిద్ధాంతాల కోసం సినిమాలు చేయాల్సి వచ్చింది” అని పవన్ కళ్యాణ్ తెలిపారు. పదవులు పొందిన నాయకులు ప్రజల బాధలు తెలుసుకోవాలి. పదవి అంటే ఒక్కరిది కాదని, వెనుక ఉన్న వేల మంది జనసైనికుల కృషికి గుర్తింపుగా భావించాలి” అని అన్నారు. జనసేన పార్టీని శాశ్వత రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు బలమైన నాయకత్వ వ్యవస్థ అవసరమని పవన్ కళ్యాణ్ అన్నారు. “వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బాధ్యతాయుత నాయకత్వం నిర్మించాల్సిన అవసరం ఉంది. జనసేన వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. కష్టకాలంలో ఎవరు మనవాళ్లు, ఎవరు పరాయి వాళ్లు అనేది గుర్తుంచుకోవాలి అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ తనచేసిన కృషికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రశంసలు తెలియజేశారు. “నిరంతరం కార్యకర్తలతో మమేకమై పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. అలాంటి నేతలు పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఉంది” అని అన్నారు.

    Latest articles

    Gold Prices on August 31 | మ‌ళ్లీ భ‌గ్గుమంటున్న బంగారం.. తులంపై ఎంత పెరిగిందంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices on August 31: దేశంలో బంగారం, వెండి ధరలు భ‌గ్గుమంటున్నాయి. ప్రతిరోజూ స్వల్ప...

    Tea-snacks | టీ తో కలిపి ఈ స్నాక్స్ తింటే.. అంతే సంగతులు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tea-snacks | టీ మన జీవితంలో ఒక భాగమైపోయింది. చాలామంది ఉదయం, సాయంత్రం టీ తాగే...

    August 31 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 31 Panchangam : తేదీ (DATE) – 31 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Kamareddy Flood troubles | నాలాల ఆక్రమణలతోనే వరద కష్టాలు.. మీడియాతో కామారెడ్డి వాసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Flood troubles | కుండపోత వర్షం కామారెడ్డి ప్రజలకు (Kamareddy People) కన్నీళ్లు మిగిల్చింది....

    More like this

    Gold Prices on August 31 | మ‌ళ్లీ భ‌గ్గుమంటున్న బంగారం.. తులంపై ఎంత పెరిగిందంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices on August 31: దేశంలో బంగారం, వెండి ధరలు భ‌గ్గుమంటున్నాయి. ప్రతిరోజూ స్వల్ప...

    Tea-snacks | టీ తో కలిపి ఈ స్నాక్స్ తింటే.. అంతే సంగతులు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tea-snacks | టీ మన జీవితంలో ఒక భాగమైపోయింది. చాలామంది ఉదయం, సాయంత్రం టీ తాగే...

    August 31 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 31 Panchangam : తేదీ (DATE) – 31 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...